తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: సెకండ్ వీక్​ ఎలిమినేషన్స్ - ఆ ఇద్దరిలో బయటికి వెళ్లేదెవరు? - Bigg Boss 8 Second Week Elimination - BIGG BOSS 8 SECOND WEEK ELIMINATION

Bigg Boss 8 Telugu Elimination : బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. రెండో వారం ఎలిమినేషన్స్​ హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఓటింగ్ లైన్స్ ప్రకారం.. ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్​లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వారెవరు? అందులో ఇంటి నుంచి బయటికి వెళ్లేదెవరు?

Bigg Boss 8 Telugu Elimination
Bigg Boss 8 Telugu Elimination (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 2:37 PM IST

Bigg Boss 8 Telugu Second Week Elimination: రోజులు గడిచే కొద్దీ.. ఆసక్తికరమైన టాస్క్​లతో.. ఇంటి సభ్యుల మధ్య గొడవలతో.. కంటెస్టెంట్ల స్ట్రాటజీలతో.. తెలుగు బిగ్​బాస్ సీజన్ 8 చాలా రసవత్తరంగా మారుతోంది. చూస్తుండగానే సెకండ్ వీక్ ఎలిమినేషన్స్​ టైమ్ వచ్చేసింది. మరి.. ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు వెళ్లనున్నారు?

గత ఆదివారం నాడు ఇంటి నుంచి బేబక్క ఎలిమినేట్​ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోమ, మంగళవారం రెండూ రోజులు నామినేషన్ల ప్రక్రియ చేపట్టాడు బిగ్​బాస్​. ఇందులో కంటెస్టెంట్ల మాటల యుద్ధం తర్వాత.. మొత్తంగా ఎనిమిది మంది నామినేట్​ అయ్యారు. వారిలో.. శేఖర్ బాషా, పృథ్వీరాజ్, నిఖిల్, ఆదిత్య, నాగ మణికంఠ, నైనిక, సీత, విష్ణు ప్రియ ఉన్నారు.

నిన్న రేషన్​ కోసం - నేడు ప్రైజ్​ మనీ కోసం - హోరాహోరీగా ఫైట్​ చేస్తున్న కంటెస్టెంట్లు - ప్రోమోలు చూశారా?

ఎవరు ఎలిమినేట్​ కానున్నారు:సెకండ్ వీకెండ్ నామినేషన్లలో ఈసారి ఊహించని ట్విస్ట్ చోటు చేసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఈ వీక్ నామినేషన్లలో ఎలిమినేషన్ కత్తి మాత్రం ఇద్దరి మీదే ఉందని అంటున్నారు. ఎనిమిది మందిలో ఈ వీక్ సేఫ్ జోన్​లో ఉన్నది నిఖిల్, విష్ణుప్రియ అని సమాచారం. వీరికి ఫ్యాన్​ బేస్​ ఎక్కువ ఉండటంతో.. ఓట్లు భారీగానే పోల్​ అయ్యాయని టాక్​. ఇక గేమ్​లో ముందుగా సింపతి కార్డు ప్లే చేసిన నాగ మణికంఠ ఇప్పుడు ఆట తీరును మెరుగు పరుచుకుని ఈ వీక్ కూడా సేఫ్ జోన్లో ఉన్న వారి లిస్ట్​లోనే స్థానం దక్కించుకున్నాడు. ఇక డేంజర్ జోన్​లో ఉన్నది మిగతా ఐదుగురు. వారి స్థానాలు చూస్తే.. నైనిక, పృథ్వీరాజ్​, సీత, శేఖర్​బాషా, ఆదిత్య ఓం. లాస్ట్​లో ఉన్న ఇద్దరిలో.. ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది మాత్రం ఆదిత్యకే అని టాక్​.

డబుల్​ ఎలిమినేషన్​!:ఈ వీకెండ్ ఊహించని పరిణామం చోటు చేసుకోబోతోందని కూడా అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ పేరుతో హౌజ్​ మేట్స్​లో ఇద్దరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తారని ఓ రేంజ్​లో న్యూస్ వైరల్ అవుతోంది. ఒకవేళ అదే గనక నిజమైతే శేఖర్ భాష, ఆదిత్య ఇద్దరూ ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. లేదు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉందంటున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.

బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్!

"బిగ్‌బాస్‌కి రావడమే నేను చేసిన.." - హౌజ్​లో బరస్ట్​ అయిన విష్ణుప్రియ - ఏం జరిగిందో తెలుసా?

బిగ్​బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్‌ నుంచే ప్రేమాయణం!!

ABOUT THE AUTHOR

...view details