తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఊహించని కంటెస్టెంట్స్​తో బిగ్​బాస్ ఫైనల్ లిస్ట్! - వీళ్లను కూడా పట్టుకొస్తున్నారా! - ఇదెక్కడి కథ రా నాయనా! - Bigg Boss Season 8 Contestants List - BIGG BOSS SEASON 8 CONTESTANTS LIST

Bigg Boss Season 8 : మరో మూడు రోజుల్లో బిగ్​బాస్​ సంగ్రామం మొదలుకానుంది. ఈ క్రమంలోనే బిగ్​బాస్​ ఇంట్లోకి వెళ్లే వారిలో 10 మంది పేర్లు కన్ఫ్మామ్​ అయినట్లు సోషల్​ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే మరో ఊహించని ట్విస్ట్​ తెరపైకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Bigg Boss Season 8
Bigg Boss Season 8 Contestants List (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 10:55 AM IST

Bigg Boss Season 8 Contestants List:ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్ 8 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఓ వైపు ఈ షో పై వివాదాలు వస్తున్నా.. షో గురించి మాత్రం అభిమానులు ఎప్పటికప్పుడు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బిగ్‏బాస్ రియాల్టీ షో స్టార్ట్ కానుందని ఇది వరకే నిర్వాహకులు అఫిషీయల్​గా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్​బాస్​ సీజన్​ 8లో పాల్గొనే కంటెస్టెంట్స్​లో ఈ పది మంది ఫైనల్​ అంటూ ఓ లిస్ట్​ బయటికి వచ్చింది. అంతేనా బిగ్​బాస్​ మాజీలు కూడా ఈ సీజన్​లో పాల్గొంటారని మరో న్యూస్​ వైరల్ అయ్యింది​. ఇంతకీ ఈ ఫైనల్​ ఆటగాళ్లు ఎవరు? హౌజ్​లోకి వచ్చే మాజీలు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం..

సాధారణంగా బిగ్​బాస్​లోకి వెళ్లే కంటెస్టెంట్స్​ చాలా మంది ప్రజలకు తెలిసిన వారే ఉంటారు. ముఖ్యంగా​ సీరియల్ యాక్టర్స్, హీరోహీరోయిన్స్, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్, సింగర్స్​, డ్యాన్సర్స్​, మోడల్స్ ఇలా చాలా మంది ప్రజలకు పరిచయం ఉన్నవారే హౌజ్​లోకి ఎంటర్​ అవుతుంటారు. ఈ సీజన్​లో కూడా ఈ విభాగాలకు చెందిన వారే ఉన్నారు. బిగ్​బాస్​లో పాల్గొనేది వీళ్లే అంటూ ఇప్పటికే చాలా మంది పేర్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా సీజన్​ 8లో హౌజ్​లోకి అడుగుపెట్టేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని.. వారంతా హౌజ్​లోకి ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సీజన్​లో మొత్తం 19 మంది పాల్గొంటారని.. ముందుగా 14 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇది వరకు నెట్టింట వినిపించిన పేర్లు కాకుండా ఇప్పుడు మరికొంత మంది కొత్త సెలబ్రెటీల పేర్లు తెరపైకి వచ్చాయి.

బిగ్​బాస్​ 8: హౌజ్​​లోకి వీళ్లు కూడా వచ్చేస్తున్నారటగా! - కొత్త కంటెస్టెంట్ల పేర్లు వైరల్

ఫైనల్​ అయిన 14 మంది వీళ్లే అంటూ ప్రచారం:

  • విష్ణుప్రియ భీమినేని
  • శేఖర్ బాషా
  • బెజవాడ బేబక్క
  • నైనికా
  • విస్మయ శ్రీ
  • ఆదిత్య ఓం
  • మోడల్ రవితేజ
  • దర్శకుడు పరమేశ్వర్
  • ఖయ్యూమ్ అలీ
  • సౌమ్యరావు
  • గాయకుడు సాకేత్
  • అంజలి పవన్
  • అభినవ్ నవీన్
  • అభిరామ్ వర్మ

వైల్డ్​ కార్డ్​ ద్వారా మరో ముగ్గురు: ఈ 14 మంది దాదాపు నూటికి నూరు శాతం బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్స్ అని పక్కా సమాచారం. వీరితోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ రీతూ చౌదరి, సీరియల్​ ఫేమ్ ఇంద్రనీల్ వర్మ, రాకింగ్​ రాకేష్​ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. అయితే, వీరిని షో ప్రారంభం అయిన రెండో వారం, లేదా మూడో వారం హౌజ్‌లోకి పంపించనున్నారట.

మాజీలు ఇద్దరు: ఈ 17 మందితోపాటు బిగ్​బాస్ తెలుగు 8లోకి మాజీలు కూడా రాబోతున్నట్లు టాక్​ వినిపిస్తోంది. వారిలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్స్ హరితేజ, ఆదర్శ్‌ను, బీబీ 3 హౌజ్‌మేట్స్ పునర్నవి, వరుణ్ సందేశ్ భార్య వితిక, అలాగే బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌లో పాల్గొన్న సిరి హన్మంతు పేర్లు లిస్ట్​లో ఉన్నాయని సమాచారం. వీళ్లందరిలో ఇద్దరు పాల్గొంటారని టాక్​ వినిపిస్తుంది. అయితే ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరో మూడు రోజులు వెయిట్​ చేయక తప్పదు!

వైరల్ న్యూస్ : బిగ్​బాస్​ 8లోకి టాలీవుడ్ హీరో - ఈ సీజన్​లో మస్తు షేడ్స్​ ఉన్నట్టున్నయ్​గా!

బిగ్​ బాస్​ 8లో "డబుల్ ధమాకా" - ఇప్పటి వరకూ చూడని సరికొత్త ఎలిమెంట్​ చూపిస్తారట!

ABOUT THE AUTHOR

...view details