తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: ఆమె కోసం అతడు బలి! - ఈ సీజన్​లో తొలిసారి డబుల్​ ఎలిమినేషన్​!? - Bigg Boss 8 Fourth Week Elimination

Bigg Boss Elimination : బిగ్‏బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ముగ్గురు ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం హౌజ్​లో 11 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరపడింది. అయితే ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉండనుందని సమాచారం. మరి ఈ లెక్కన ఇంటి నుంచి బయటికి వెళ్లేదెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Bigg Boss Elimination
Bigg Boss Elimination (ETV Bharat)

Bigg Boss 8 Telugu Fourth Week Elimination:సెప్టెంబర్​ 1న గ్రాండ్​గా మొదలైన బిగ్​బాస్​ సీజన్​ 8 మంచి రంజుగా సాగుతోంది. గొడవలు, అలకలు, మాటలు, టాస్కులు, లవ్​ట్రాక్స్​తో దూసుకుపోతోంది. ఇక ఇంట్లోకి అడుగు పెట్టిన 14 కంటెస్టెంట్లలో ముగ్గురు ఎలిమినేట్​ కాగా.. నాలుగో వారం ఎలిమినేషన్​ సమయం దగ్గర పడింది. అయితే ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉండనుందని సమాచారం. మరి ఈ లెక్కన ఇంటి నుంచి బయటికి వెళ్లేదెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నామినేషన్లలో ఉన్నది వీళ్లే: నాలుగో వారం నామినేషన్లు హాట్​హాట్​గా సాగాయి. ముఖ్యంగా సోనియా - నబీల్​ మధ్య మాటల యుద్ధమే జరిగింది. అలా ఈ వారం నబీల్, సోనియా, మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, ప్రేరణ, నైనిక నామినేట్ కాగా.. చీఫ్ నిఖిల్ తన స్పెషల్ పవర్​తో నైనికను సేవ్ చేశాడు. దీంతో నైనిక మినహా మిగిలిన వారు అంటే ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఓటింగ్.. శుక్రవారం వరకు కొనసాగింది.

ఎవరు టాప్​లో.. ఎవరు లీస్ట్​లో: ఈ వారం తన ఆట తీరుతో నబీల్ రేంజు పెరిగింది. ముఖ్యంగా సోనియా, పృథ్వీ, నిఖిల్ ఆట తీరుపై నబీల్ మాట్లాడిన పాయింట్స్ జనాలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. దీంతో అతనికి ఊహించని రేంజ్​లో ఓటింగ్ శాతం పెరిగింది. సోమవారం జరిగిన నామినేషన్స్​లో నబీల్ వర్సెస్​ సోనియా టీమ్ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఇక ఆ మరుసటి రోజు నబీల్ ఏకంగా 35 శాతం ఓటింగ్​తో టాప్​లో నిలిచాడు. ఈ వారం మొత్తం అత్యధిక ఓటింగ్​తో నబీల్ మొదటి స్థానంలో ఉన్నాడు. శుక్రవారం రోజున ఓటింగ్​ పూర్తికాగా.. ఇప్పటివరకు ఏ అన్​ అఫీషియల్​ పోల్​ చూసినా.. నబీల్​ మొదటి స్థానంలోనే ఉన్నాడు. ఆ తర్వాత మణికంఠ, ప్రేరణ ఉన్నారు. దీంతో ఈ వారం ముగ్గురు సేఫ్ జోన్​లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరి తర్వాత ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియా డేంజర్ జోన్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

డబుల్​ ఎలిమినేషన్​:అయితేమరికొన్ని రోజుల్లో వైల్డ్​కార్డ్​ ఎంట్రీలు హౌజ్​లోకి రానున్న నేపథ్యంలో.. ఆ లోపు హౌజ్​ నుంచి ముగ్గురు లేదా నలుగురిని బయటికి పంపాలని బిగ్​బాస్​ టీమ్​ భావిస్తోందట.ఈ నేపథ్యంలోనే ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందని టాక్​. ఇందులో భాగంగా సోనియా, ఆదిత్య ఓంను బయటకు పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే బిగ్​బాస్​ పెద్ద ప్లాన్​ అమలు చేయనున్నట్లు సమాచారం. ఆదిత్య ఓం, సోనియాను ఎలిమినేట్​ చేసి.. ఇందులో సోనియాను సీక్రెట్​ రూమ్​కు పంపనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే సోనియా ఉంటేనే కావాల్సినంత కంటెంట్, గొడవలు ఉండనున్నాయి. దీంతో ఆమెను ఎలిమినేట్​ చేసినట్లే చేసి సీక్రెట్​ రూమ్​కి పంపనున్నారని టాక్​.

ఇక్కడ మరో అవకాశం కూడా ఉందంట. అదేంటంటే.. సోనియాను ఎలిమినేట్​ చేసి మళ్లీ వైల్డ్​ కార్డ్​ ఎంట్రీగా తీసుకురానున్నారని బిగ్​బాస్​ వర్గాల సమాచారం. అంటే గత సీజన్​లో రతికను ఎలిమినేట్​ చేసి వైల్డ్​ కార్డ్​లో తీసుకొచ్చినట్లుగా.. ఈ సారి ఆ అవకాశాన్ని సోనియాకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరి ఈ వారం సింగిల్​ ఎలిమినేషనా? డబుల్​ ఎలిమినేషనో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

బిగ్​ బాస్​ 8: హౌజ్​లోకి 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ - వాళ్లు ఎవరు, ఎప్పుడొస్తున్నారో తెలుసా?

హౌజ్​మేట్స్​ కాపాడినా ప్రేక్షకులు కరుణించలేదు - మూడో వారం అభయ్​​ ఎలిమినేట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

ABOUT THE AUTHOR

...view details