Bigg Boss 8 Seventh Week Nominations :బిగ్‌బాస్‌లో నామినేషన్స్ అంటే ఓ రేంజ్లో ఉంటాయి. తగిన రీజన్స్ చెబుతూ తమకు నచ్చనివాళ్లను నామినేట్ చేస్తుంటారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య వాడీవేడిగా వాగ్వాదాలు జరుగుతుంటాయి. అయితే సీజన్ 8లో ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్ ఒకలెక్క.. ఈ ఏడో వారం జరిగిన నామినేషన్స్ మరో లెక్క అన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకూ జరిగిన ఏడు వారాల ఆటలో హీటింగ్ నామినేషన్స్ అంటే మాత్రం ఈ వారానివే. సోమవారం ఎపిసోడ్‌లో గౌతమ్-అవినాష్ మధ్య జరగిన గొడవ ఓ రకంగా ఉంటే.. మంగళవారం ఎపిసోడ్‌లో అవినాష్ - పృథ్వీ మధ్య జరిగిన గొడవ అయితే అంతకుమించి అనేలా ఉంది. ముఖ్యంగా రా, రేయ్ అనొద్దు అంటూ అవినాష్ ఎంత చెప్పినా సరే పృథ్వీ మాత్రం నా ఇష్టంరా అంటా.. ఏం చేస్తావ్ అంటూ రెచ్చిపోయాడు. మరి ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఎవరు నామినేట్ అయ్యారు.. అనేది ఈ స్టోరీలో చూద్దాం..
కొద్దిసేపు యష్మీ, ప్రేరణ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత గుర్రం సౌండ్ వచ్చినప్పుడు హ్యాట్‌ను యష్మీ తీసుకుని ప్రేరణకు ఇచ్చింది. ఇక నిఖిల్ అండ్ విష్ణుప్రియ నామినేట్ చేయడానికి నిలబడగా.. విష్ణుప్రియ రివెంజ్ నామినేషన్ వేస్తున్నట్లు చెప్పింది. దీంతో బిగ్‌బాస్ కలుగజేసుకుని "రివెంజ్ నామినేషన్ అనేది సరైన కారణం కాదు" అంటూ చెప్పారు. ఇక టేస్టీ తేజ కూడా "ఇక్కడ నామినేషన్లు ఓజీ వర్సెస్ తేజ అన్నట్టు నడుస్తున్నాయి" అని చెప్పాడు. ఫైనల్‌గా టేస్టీ తేజ నామినేట్ అయ్యాడు.
ఇక తనకి ఛాన్స్ రాగానే అవినాష్‌ని నామినేట్ చేశాడు పృథ్వీ. "లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేస్తూ నేను కేవలం రెండు టాస్కుల్లోనే కనిపించానని అవినాష్ చెప్పాడు.. అది నాకు నచ్చలేదు.. ఎందుకంటే నేను చాలా టాస్కులు ఆడా.. కానీ బయట బిట్స్ బిట్స్ చూసి లేదా ప్రోమో చూసి నన్ను నామినేట్ చేసినట్టు అనిపించింది. అందుకే ఈ వారం నేను అవినాష్‌ను నామినేట్ చేస్తున్నా" అంటూ పృథ్వీ చెప్పాడు.
దీనికి డిఫెండ్ చేసుకునే క్రమంలో అవినాష్ ఓ నిజం చెప్పాడు.."అవును భయ్యా.. నేను ఫుల్ చూడలేదు ఎపిసోడ్స్ అన్నీ.. ఎందుకంటే నేను అంత ఖాళీగా లేను.. కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చూసి వచ్చా. ఆ విషయం నాగార్జునకి కూడా చెప్పా.. కానీ మా వైఫ్ రెగ్యులర్‌గా చూస్తుంది.. నేను తనని కనుక్కున్నాను.. ఎవరు ఎలా ఉన్నారు ఏంటని.. అందుకే నామినేట్ చేశా" అంటూ సమాధానం చెప్పాడు. దీనికి పృథ్వీకి బాగా కాలింది. "అలా అయితే మీ వైఫ్ రావాల్సింది బిగ్‌బాస్‌కి మీరెందుకు వచ్చారు" అంటూ పృథ్వీ అడిగాడు. "మా వైఫ్ టాపిక్ తేకు.. తను రాదు" అంటూ సీరియస్ అయ్యాడు అవినాష్.
బిగ్‌బాస్ 8: ఆరో వారం కిర్రాక్ సీత అవుట్ - రెమ్యునరేషన్ వివరాలు లీక్!
"అయినా నేను ఒక్కడినే నిన్ను నామినేట్ చేయలేదు కదా.. లాస్ట్ వీక్ వేరే వాళ్లు కూడా చేశారు.. అవే పాయింట్లు చెప్పారు కదా" అంటూ అవినాష్ వాదించాడు. దీంతో "నువ్వు ఖాళీగా లేవు. షూటింగ్స్‌లో బిజీగా ఉన్నావ్ కదా.. ఇప్పుడెందుకు వచ్చావ్ షోకి.. ఇప్పుడు షూటింగ్స్ లేవా" అంటూ పృథ్వీ వెటకారం ఆడాడు. అలానే "ఎవరినో అడిగి నామినేషన్ చేశావ్.. అది కరెక్ట్ కాదు" అంటూ పృథ్వీ అన్నాడు. దీనికి నేనే కాదు గంగవ్వ కూడా నీపై అవే పాయింట్లతో నామినేట్ చేసింది కదా అంటూ అవినాష్ అనగా.. గంగవ్వ గురించి ఎందుకు చెబుతావురా నీ గురించి చెప్పు అంటూ స్లిప్ అయ్యాడు పృథ్వీ. దీనికి నువ్వు రా అనకు .. అంటూ అవినాష్ సీరియస్ అయ్యాడు. ఇంకేముంది పృథ్వీ రెచ్చిపోతూ అంటా.. నా ఇష్టం అంటా.. ఏం చేస్తావ్‌రా అంటూ రెయిజ్ అయ్యాడు.
దీంతో అవినాష్ కూడా బాగానే రెయిజ్ అయ్యాడు. ఎందుకంటావ్.. రా ఎలా అంటావ్ అసలు.. అంటూ అవినాష్ అన్నాడు. ఇక ఇద్దరూ కొట్టుకునేలా మీదమీదకి రావడంతో నిఖిల్ సహా అందరూ ఆపారు. కాసేపటికి "నీ పాయింట్లు నాకు నచ్చలేదు.. నేను యాక్సెప్ట్ చేయడం లేదు నీ నామినేషన్" అంటూ అవినాష్ అన్నాడు. దీనికి అక్కర్లేదురా నేను చేశా అంటూ పృథ్వీ మళ్లీ రెచ్చగొట్టాడు. అయినా రెస్పెక్ట్ అనేది అడుక్కంటే రాదు.. ఎర్న్ చేసుకోవాలి అంటూ డైలాగ్ కొట్టాడు పృథ్వీ. దీంతో "నీకు సంస్కారం లేదు .. చిన్న పెద్దా తేడా లేదు.. 7 సంవత్సరాలు నీకంటే నేను పెద్ద ఈ విషయం కూడా నీకు తెలుసు.. అయినా అలా బిహేవ్ చేస్తున్నావ్" అంటూ అవినాష్ అన్నాడు. కానీ పృథ్వీ ఏ మాత్రం తగ్గలేదు.
ఇక మరోవైపు నయని.. విష్ణుప్రియను నామినేట్ చేసింది. దీంతో హరితేజ.. పృథ్వీ నామినేషన్‌యే యాక్సెప్ట్ చేస్తున్నట్లు చెప్పింది. "వాడు, రేయ్ అనే మాటలు వాడటం తప్పు పృథ్వీ.. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉందని నాకు తెలుసు.. కానీ వాడకూడదు" అంటూ హరితేజ సలహా ఇచ్చింది. "ఇక అవినాష్ వైఫ్ పాయింట్ మీద నామినేట్ చేశా అని చెప్పడం కరెక్ట్‌గా అనిపించలేదు.. ఎందుకంటే ఎపిసోడ్స్ చూడకుండా నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.. కనుక అవినాష్‌ను నామినేట్ చేస్తున్నా" అంటూ హరితేజ చెప్పింది. దీంతో వీళ్లిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
ఇక సీన్ కట్ చేస్తే ఓ అనౌన్స్‌మెంట్ చేశాడు బిగ్‌బాస్. "ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు.. గౌతమ్, పృథ్వీ, నిఖిల్ మణికంఠ, యష్మీ, తేజ, నబీల్, ప్రేరణ, అవినాష్. అయితే రాయల్స్ మీ దగ్గర మీరు గెలుచుకున్న ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది.. దాన్ని మీరు వినియోగించుకోవచ్చు.. దాని ద్వారా నామినేషన్స్‌లో ఉన్న వారిని ఒకరిని సేవ్ చేయొచ్చు కానీ దానికి బదులుగా మీరు ఒకరిని స్వాప్ చేయాలి" అంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక ఆ షీల్డ్‌ను గంగవ్వ-అవినాష్ కలిసి గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవినాష్ ఆ పవర్‌తో తనని సేవ్ చేసుకొని ఆ ప్లేస్‌లో హరితేజను స్వాప్ చేశాడు. ఇంతటితో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఈ వారం నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే..
- గౌతమ్
- పృథ్వీ
- నిఖిల్
- మణికంఠ
- యష్మీ
- తేజ
- ప్రేరణ
- నబీల్
- హరితేజ
మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా?
"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్ కామెంట్స్!