తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: ఎలిమినేట్​ అయ్యేదెవరో తెలిసిపోయిందిగా! - ఒకరు ఇంటికి - మరొకరు సీక్రెట్​ రూమ్​కు! - Bigg Boss 8 Fourth Week Elimination - BIGG BOSS 8 FOURTH WEEK ELIMINATION

Bigg Boss 8 Elimination: ప్రస్తుతం బిగ్‌బాస్ లవర్స్ అందరూ ఎదురు చూసేది నాలుగో వారం ఎలిమినేషన్​ కోసం. ఎందుకంటే ఈ వారం నామినేషన్లలో విపరీతమైన నెగిటివీని సంపాదించుకున్న సోనియా ఆకుల ఉంది. పైగా ఆమె డేంజర్​ జోన్​లో ఉంది. దీంతో ఈ వారం ఆమె ఎలిమినేట్​ అవుతుందా? లేదంటే ఆమె ప్లేస్​లో ఎవరినైనా బలి చేస్తారా అని క్యూరియాసిటీతో ఉన్నారు. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Bigg Boss 8 Elimination
Bigg Boss 8 Elimination (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2024, 10:16 AM IST

Bigg Boss 8 Fourth Week Elimination :బిగ్‌బాస్ లవర్స్ అందరూ నాలుగో వారం ఎవరూ ఎలిమినేట్ కాబోతున్నారనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. ఈ వారం నామినేషన్లలో విపరీతమైన నెగిటివీని సంపాదించుకున్న సోనియా ఆకుల ఉంది. పైగా ఆమె డేంజర్​ జోన్​లో ఉంది. దీంతో.. ఈ వారం ఆమె ఎలిమినేట్​ అవుతుందా? లేదంటే ఆమె ప్లేస్​లో ఎవరినైనా బలి చేస్తారా? అని క్యూరియాసిటీతో ఉన్నారు. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ వారం నామినేషన్​లో ఆరుగురు హౌజ్​మేట్స్ ఉన్నారు. సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ శెట్టి, నబిల్, ప్రేరణ కంబం, నాగ మణికంఠ నామినేషన్లలో ఉన్నారు. ఇక ఓటింగ్ ప్రక్రియ సోమవారం రాత్రి మొదలై శుక్రవారం రోజు పూర్తయింది. ఇక ఈ వారం మొత్తం 12 వైల్డ్​ కార్డ్​ ఎంట్రీలను ఆపేందుకు టాస్క్​లు పెట్టగా.. మొత్తంగా మూడు గేమ్​లు గెలిచి మూడు వైల్డ్​ కార్డ్​లను ఆపారు. ఇక ఆ తర్వాత రేషన్​ కోసం టాస్కులు పెట్టాడు బిగ్​బాస్​.​ ఇక వీకెండ్​ రానే వచ్చేసింది.​ నాలుగో వారం ఆటపై రివ్యూ ఇచ్చేందుకు శనివారం నాగార్జున వచ్చేశారు. అయితే హీరోలా ఆడుతుంది ఎవరు.. జీరోలా ఆడుతుంది ఎవరు..? మీరే చెప్పాలంటూ ఒక్కో కంటెస్టెంట్‌కి అవకాశం ఇచ్చారు నాగార్జున. దీంతో కంటెస్టెంట్లందరూ హీరో అనుకుంటున్న వారి తలపై కిరీటం పెట్టి.. జీరో అనుకుంటున్న వారి ముఖం మీద క్రాస్​ మార్క్​ వేశారు. అయితే ఈ ప్రక్రియలో కొద్దిమందికి నాగార్జున గట్టిగానే క్లాస్​ పీకారు. ముఖ్యంగా సోనియా, నిఖిల్​, విష్ణుప్రియ, మణికంఠలకు సంబంధించిన వీడియోలు వేసి మరి వాయించేశారు.

బిగ్​బాస్​ 8: ఆమె కోసం అతడు బలి! - ఈ సీజన్​లో తొలిసారి డబుల్​ ఎలిమినేషన్​!?

డేంజర్​ జోన్​లోకి వారిద్దరూ:ఇక హౌస్‌లో ఎక్కువ జీరోలు మణికంఠకే రావడంతో నాగ్ ఓ షాకిచ్చారు. "మణికంఠ హౌజ్​ ప్రకారం నీ ఆట జీరో అనిపిస్తుంది.. నువ్వు కూడా దానికి ఒప్పుకుంటున్నావ్.. నీకు ఎక్కువ జీరోస్ వచ్చినందుకు నువ్వు డైరెక్ట్‌గా డేంజర్ జోన్‌లోకి వెళ్లావ్​" అంటూ నాగ్ అన్నారు. అంటే ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యేందుకు డేంజర్ జోన్‌కి వచ్చే ఇద్దరి క్యాండెట్స్‌లో ఒకరు మణికంఠ అని ముందే ఫిక్స్ చేశారు నాగ్. మరోవైపు నబీల్‌కి ఎక్కువ హీరోస్ వచ్చాయి.. కనుక నాగ్ స్పెషల్‌గా కబాబ్ ఇప్పించారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో మణింకఠ ఎలాగూ డేంజర్ జోన్ కాబట్టి.. మిగిలిన ఐదుగురులో ఒకరిని సేవ్ చేశారు. ఇక ఆ సేవ్ అయింది కూడా నబీల్‌యే. ఇక మిగిలిన వారిలో ఎవరు సేవ్​ అయ్యారు అనే విషయాన్ని నేటి(ఆదివారం) ఎపిసోడ్​లో చెప్పనున్నారు.

అయితే అన్​ అఫీషియల్​ పోల్స్​లో మొదటి స్థానంలో నబీల్​ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరసగా ప్రేరణ, మణికంఠ, ఆదిత్య, పృథ్వీ, సోనియా ఉన్నారు. వీరిలో ఆల్​రెడీ మణికంఠ డేంజర్​ జోన్​లో ఉండగా.. మరో కంటెస్టెంట్​ సోనియా కూడా డేంజర్ జోన్‌ కు వచ్చేసింది. ఇక వీరిద్దరిలో సోనియాను ఎలిమినేట్​ చేసినట్లు సోషల్​ మీడియాలో న్యూస్​ వైరల్​ అవుతోంది. ఈ విషయాన్ని ఆదివారం రోజు నాగార్జున అఫీషియల్​గా ప్రకటిస్తారని అంటున్నారు.

మణికంఠకు ఆఫర్​:అయితే ఇక్కడ మణికంఠను కూడా ఎలిమినేట్​ చేసి సీక్రెట్​ రూమ్​కి పంపిస్తారని టాక్​. ఎందుకంటే మణికంఠ హౌజ్​లో ఎక్కువ ఎమోషనల్​ అవుతున్నాడని.. కొద్దిరోజులు సీక్రెట్​ రూమ్​కు పంపిస్తే గత సీజన్లో గౌతమ్​ లెక్క.. ఈ సీజన్​లో కూడా మణికంఠ 2.0 గా మారి వస్తాడని బిగ్​బాస్​ నిర్వాహకులు అనుకుంటున్నారని సమాచారం. అందుకే నాగార్జున డైరెక్ట్​గా మణికంఠను డేంజర్​ జోన్​లో ఉంచారని టాక్​. మరి, దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్​ చేయాల్సిందే!

బిగ్​ బాస్​ 8: హౌజ్​లోకి 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ - వాళ్లు ఎవరు, ఎప్పుడొస్తున్నారో తెలుసా?

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

ABOUT THE AUTHOR

...view details