Best Horror Movies In Youtube :మూవీ లవర్స్‌లో హారర్ చిత్రాలకు, వెబ్ సిరీసులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రతివారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ జానర్‌కు సంబంధించి పలు సినిమాలను రిలీజ్ చేస్తుంటాయి. అయితే అందరికీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉండకపోవచ్చు. అలాంటి వారు యూట్యూబ్‌లో ఫ్రీగా సినిమాలు చూస్తుంటారు. వారి కోసం ఓటీటీతో పాటు యూట్యూబ్‌లోనూ స్ట్రీమింగ్ అయ్యే సూపర్ హారర్ మూవీస్ వివరాలను తీసుకొచ్చాం. మరి ఆ భయపెట్టే చిత్రాలేంటో ఓ లుక్కేద్దాం.
కాలింగ్ బెల్ : ఈ హరర్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. గోల్డెన్ టైమ్ పిక్చర్స్ బ్యానర్‌పై అనూద్ నిర్మించారు. పన్నా రాయల్ దర్శకత్వం వహించారు. కిషోర్, రవివర్మ, కిషోర్, మమతా రహుత్, సంకీర్త్, వ్రితి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ ఇంట్లో దెయ్యం ఉన్న సంగతి తెలీక కొత్తగా పెళ్లైన ఓ జంట ఆ ఇంట్లోకి దిగుతారు. ఎంతో సంతోషంగా గడుపుతారు. కానీ, తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు. అనంతరం అదే దెయ్యం ఉన్న ఇంట్లో కొంతమంది స్నేహితులు దిగుతారు. మరి అప్పుడు ఏం జరిగిందనే కథతోనే కాలింగ్ బెల్ తెరకెక్కింది. థ్రిల్లింగ్, హారర్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆకట్టుకుంటుంది. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. యూట్యూబ్‌లో ఈ సినిమాను ఫ్రీగా చూడొచ్చు.
రాక్షసి : కాలింగ్ బెల్ సినిమాకు సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ నిర్మించారు. ఈ సినిమాకూ పన్నా రాయల్ దర్శకత్వం వహించారు. పూర్ణ, అభినవ్ సర్దార్, అభిమన్యు సింగ్, గీతాంజలి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఇద్దరు పిల్లల తల్లిగా లీడ్ రోల్లో నటించిన పూర్ణ ఓ ఇంట్లోకి దిగుతుంది. అక్కడ తనకు ఎదురైన షాకింగ్ అనుభవాల గురించి ఓ స్వామిజీకి చెబుతుంది. అప్పుడు స్వామిజీ చెప్పిన నిజాలు విని షాక్ అయిన ఆమె ఆ తర్వాత దెయ్యాన్ని ఎలా ఎదుర్కొంది, చివరకి ప్రాణాలను కాపాడుకుందా లేదా అనే కథతో తెరకెక్కించారు.