తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రాజస్థాన్ ఓవర్ - 'NBK 109' నెక్స్ట్​ షెడ్యూల్ ఎక్కడంటే? - Balakrishna NBK 109 - BALAKRISHNA NBK 109

Balayya NBK 109 Next Schedule : నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న NBK 109 మూవీ తదుపరి షెడ్యూల్ ఎక్కడ జరగనుందంటే?

Balayya NBK 109 Next Schedule
Nandamuri Balakrishna (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 18, 2024, 6:27 AM IST

Updated : Aug 18, 2024, 7:42 AM IST

Balayya NBK 109 Next Schedule :టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న #NBK 109 మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. ఇటీవలే రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజాగా తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు చివరి వారం నుంచి జరగనున్న ఈ షూట్​లో బాలయ్యతో పాటు మిగతా నటీనటుల టీమ్​ మొత్తం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు పలు యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాల మాట.

ఇక NBK 109 విషయానికి వస్తే, మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్​ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. ఇందులో బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో బాబీ దేవోల్‌ విలన్ రోల్​లో మెరవనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఒకే వేదికపై చిరు బాలయ్య
ఇదిలా ఉండగా, ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫరామ్ వేదికగా బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరించిన 'అన్‌స్టాపబుల్‌' మూవీ ప్పుడు నాలుగో సీజన్​తో ముందుకు రానుంది. ఇప్పటికే ఈ షో కోసం సన్నాహాలు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్​కు చీఫ్‌ గెస్ట్‌గా టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి రానున్నారని సమాచారం. వాస్తవానికి ఈ ప్రచారం ప్రతీ సీజన్‌లోనూ సాగింది. కానీ అది జరగలేదు. అయితే ఈ కొత్త సీజన్‌కు మాత్రం చిరు వస్తారని రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవినే కాదు టాలీవుడ్ మన్మథుడు, కింగ్‌ నాగార్జున కూడా ఈ సారి పాల్గొంటారని సమాచారం. వీటన్నింటితో పాటు, మరికొన్ని సర్‌ప్రైజ్‌ కూడా ఉంటాయని సమాచారం. దీనిపై ఆహా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బాలయ్య గోల్డెన్ జూబ్లీ- మోషన్ పోస్టర్ రిలీజ్ - Nandamuri Balakrishna 50 Years

బాలయ్య 'BB4' కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్​!

Last Updated : Aug 18, 2024, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details