ETV Bharat / entertainment

2024లో అదృష్టాన్ని పరీక్షించుకున్న డబ్బింగ్‌ సినిమాలు - హిట్టా ఫట్టా! - 2024 DUBBING CINEMAS IN TELUGU

తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకున్న డబ్బింగ్‌ సినిమాలు - ఇంతకీ ఇక్కడ బొమ్మ ఆడిందా?

2024 Dubbing Cinemas Released In Telugu
2024 Dubbing Cinemas Released In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 12 hours ago

2024 Dubbing Cinemas Released In Telugu : కంటెంట్​ ఉంటే ప్రాంతంతో సంబంధం లేకుండా హిట్ టాక్ అందుకుంటాయి కొన్ని సినిమాలు. పాన్ ఇండియా పరంపర మొదలైనప్పటి నుంచి ఇతర భాషల నుంచి తెలుగులోకి డబ్ అయిన పలు సినిమాలు ఇక్కడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుని దూసుకెళ్లాయి. ఈ ఏడాది తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ నుంచి పదుల సంఖ్యలో సినిమాలు తెలుగులో అనువాదమై తమ అదృష్టం పరీక్షించుకున్నాయి. అందులో ప్రేక్షకులు మెచ్చిన సినిమాలు ఏవి? వారి అంచనాలు పెంచి ఉసూరుమనిపించిని ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

2024 ఫస్ట్​ హాఫ్​లో కొన్ని మలయాళ డబ్​ సినిమాలు బాక్సాఫీస్‌ ముందు జోరు చూపిస్తే, సెకెండాఫ్​లో తమిళ డబ్బింగ్‌ చిత్రాలు ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాయి. వాస్తవానికి తెలుగులో ఈ అనువాద చిత్రాల సందడి సంక్రాంతి నుంచే మొదలైపోతుంటుంది. కానీ, ఈసారి మాత్రం తెలుగు నుంచి నాలుగు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్‌ బరిలో నిలవడం వల్ల మిగతా సినిమాలకు థియేటర్లను సర్దుబాటు చేయడం కష్టమైంది. ఈ క్రమంలో పండుగ రేసులో అనువాద చిత్రాలేవీ నిలవలేదు.

అయితే సంక్రాంతి జోరును ఆస్వాదించేందుకు తమిళ స్టార్ హీరో ధనుశ్ 'కెప్టెన్‌ మిల్లర్‌'గా వచ్చారు. అయితే భారీ అంచానతో పండుగ రేసులోకి దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయితే ఈ ఏడాది సెకెండాఫ్​లో 'రాయన్‌'గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చారు. అయితే ఈ సినిమా రిలీజైన రెండు భాషల్లోనూ మంచి వసూళ్లను అందుకుంది.

ఎటువంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ బరిలోకి దిగింది 'మహారాజ' మూవీ. మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కంటెంట్, విజయ్ సేతుపతి యాక్టింగ్​తో ఈ చిత్రం బాక్సాఫీస్‌ ఊహించని స్థాయిలో టాక్ అందుకుని దూసుకెళ్లింది. ఇటీవలే చైనాలో విడుదలై అక్కడ కూడా సూపర సక్సెస్​ సాధించింది.

సీనియర్ నటుడు కమల్‌ హాసన్‌ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్​లో రూపొందిన పాన్‌ ఇండియా మూవీ 'భారతీయుడు 2'. 90స్​లో సూపర్ హిట్ టాక్ అందుకున్న 'భారతీయుడు'కు సీక్వెల్​గా ఇది వచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఇది అభిమానులకు చేదు అనుభవాన్నే అందించింది. ఇక ఇదే నెలలో ధనుశ్​ 'రాయన్‌'గా బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్లారు. ఆ తర్వాత ఆగస్టులో మమ్ముట్టి 'టర్బో' అంతంతమాత్రంగానే ఆడగా, విక్రమ్‌ 'తంగలాన్‌'తో డీసెంట్ టాక్ అందుకున్నారు.

ఇక సెప్టెంబరు తొలి వారంలో 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌' సినిమాతో పలకరించారు దళపతి విజయ్‌. అయితే భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ పాన్‌ ఇండియా సినిమా అన్ని భాషల్లోనూ యావరేజ్ టాక్‌తోనే నడిచింది. ఆ మరసటి వారం తెరపైకి వచ్చిన టొవినో థామస్‌ 'ఏఆర్‌ఎం' మలయాళంలో భారీ వసూళ్లు సాధించింది. కానీ తెలుగులో మాత్రం కేవలం మంచి టాక్​కు మాత్రమే పరిమితమైంది.

ఇదిలా ఉండగా, స్టార్ హీరో అరవింద్‌ స్వామి, కార్తి లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన 'సత్యం సుందరం'కు ఆడియెన్స్ ఎమోషనల్​గా బాగా కనెక్ట్ అయ్యారు. ఎటువంటి అంచనాలు లేకుండా సెప్టెంబరు ఆఖరి వారంలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అటు తమిళంలో పాటు ఇటు తెలుగునూ మంచి టాక్ అందుకుని దూసుకెళ్లింది. 'జైలర్‌' తర్వాత సూపర్​ స్టార్ రజనీకాంత్‌ నుంచి నటించిన మూవీ 'వేట్టయన్‌'. దసరా బరిలో తెలుగు చిత్రాలతో పోటీపడ్డ ఈ మూవీ ఇక్కడ మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ తమిళంలో మాత్రం చక్కటి వసూళ్లే సాధించింది.

అయితే దీపావళికి తమిళం నుంచి శివ కార్తికేయన్‌ 'అమరన్‌'తో అలాగే కన్నడ నుంచి శ్రీమురళీ 'బఘీరా'తో బాక్సాఫీస్‌ బరిలో తలపడ్డారు. అయితే వీటిలో 'అమరన్‌' మాత్రమే ప్రేక్షకుల మెప్పు పొందింది. మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'అమరన్' చిత్రం రూ.47 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. సూర్య పాన్‌ ఇండియా సినిమా 'కంగువా' మాత్రం ఘోర విఫలాన్ని మూటగట్టుకుని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక డిసెంబరులో ఇప్పటికే ఉపేంద్ర 'యూఐ ది మూవీ', మోహన్‌లాల్‌ 'బరోజ్‌ త్రీడీ' చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. అయితే ప్రస్తుతం వీటికి బాక్సాఫీస్‌ ముందు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ఇందులో ఒక్కటి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకునేలా కనిపించట్లేదు. ఇక ఈనెల 27 కిచ్చా సుదీప్‌ 'మ్యాక్స్‌'తో అభిమానులను పలకరించనున్నారు. మరి అదెలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

వేసవిలో మలయాళ సినిమాల సందడి
ఈ సారి వేసవి సినీ సీజన్‌ ఫిబ్రవరి మూడో వారం నుంచే మొదలైపోయింది. ఆ వారంలో మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి 'భ్రమయుగం' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. నెగిటివ్ షేడ్స్​ ఉన్న పాత్రలో భిన్నమైన లుక్​తో మమ్ముట్టి కనబర్చిన నటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే అంతకంటే ముందు ఫిబ్రవరి రెండో వారంలో రజనీ 'లాల్‌ సలాం', మణికందన్‌ 'ట్రూ లవర్‌' ప్రేక్షకుల యావరేజ్ టాక్‌నే సరిపెట్టుకున్నాయి.

చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి అటు మలయాళంతో పాటు రిలీజైన అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్లింది 'ప్రేమలు'. మార్చి తొలి వారంలో తెలుగు తెరపైకి వచ్చిన ఈ లవ్ ఎంటర్​టైనర్​కు యూత్​ తెగ కనెక్ట్ అయ్యారు. దీంతో ప్రేక్షకులతో ఇది హిట్టు మాట వినిపించుకుంది. ఇక మార్చి ఆఖరి వారంలో 'ఆడు జీవితం'తో పృథ్వీరాజ్ సుకుమార్ ఆడియెన్స్​ను ఎమోషనల్​ రోలర్ కోస్టర్ ఎక్కించారు.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 'మంజుమ్మల్‌ బాయ్స్‌', 'డియర్‌', 'సైరన్‌', 'రత్నం' సినిమాలు బాక్సాఫీస్‌ బరిలో దిగాయి. అయితే ఇందులో 'మంజుమ్మల్‌ బాయ్స్‌' తప్ప మిగతావేవీ ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి. ఆ తర్వాతి నెలలో భరత్‌ 'మిరల్‌'కు కూడా ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు.

టాలీవుడ్​లో బీటౌన్ భామలు- డెబ్యూతోనే సక్సెస్

ఉపేంద్ర 'యూఐ'పై యశ్​, కిచ్చా సుదీప్ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.