తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఒకే ఏడాదిలో 6 బ్లాక్​బస్టర్స్​ - ఆ రేర్ రికార్డు బాలయ్యకే సొంతం! - Balakrishna Hit Movies List

Balakrishna Hit Movies List : అప్పటి నుంచి ఇప్పటి వరకూ నందమూరి నటసింహం బాలకృష్ణ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిత్వనికి కూడా ఎంతో మంది అభిమానులున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని ఏడాది ఒకటి ఉంది. ఇంతకీ ఈ ఏడాది ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Balakrishna Hit Movies List
Balakrishna (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 2:24 PM IST

Balakrishna Hit Movies List : బాలయ్య సినిమా రిలీజవుతుదంటే ఇక అభిమానులకు పెద్ద పండగ అనే చెప్పాలి. థియేటర్లలో ఆ సందడి అలా కనిపిస్తుంది మరీ. ఆయన సినిమాలకు అప్పట్లోనే కాదు ఇప్పట్లోనూ ఓ రేంజ్​లో క్రేజ్ ఉంది. అయితే నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని ఏడాది ఒకటి ఉంది. అదే 1986. ఇంతకీ ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి అని అంటారా? ఎప్పటిలాగే సెన్సేషన్ సృష్టించే బాలయ్య ఆ ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బ్లాక్‌ బ్లస్టర్​ మూవీస్ అభిమానులకు అందించి బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించారు. ఇంతకీ ఆ సినిమాలేంటో ఓ సారి చూద్దామా.

ముద్దుల క్రిష్ణయ్య
దిగ్గజ డైరెక్టర్ కోడిరామకృష్ణ, బాలయ్య కాంబోలో వచ్చిన 'ముద్దుల క్రిష్ణయ్య'తో ఆ ఏడాది బ్లాక్​బస్టర్ హిట్స్​ లిస్ట్ ప్రారంభమైంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య హీరోయిజం, అలాగే ఇద్దరు హీరోయిన్ల గ్లామర్‌ లాంటి ఎలిమెంట్స్ వల్ల బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ సాధించింది. ఎంతలా అంటే మొదటివారమే ఈ చిత్రం సుమారు రూ. కోటి గ్రాస్‌ సాధించి రికార్డుకెక్కింది.

సీతారామ కల్యాణం
బాలకృష్ణ కాలేజీ కుర్రాడిలా కనిపించి మెప్పించిన సినిమా 'సీతారామ కల్యాణం'. కామెడీ సినిమాలకు కేరాఫ్​ అడ్రెస్​గా నిలిచే జంద్యాల పగ ప్రతీకారాలతో రగిలిపోయే రెండు గ్రామాల మధ్య చక్కటి ఓ ప్రేమకథను జోడించి తెరక్కించారు. ఈ సినిమా అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది. బాలయ్య సరసన రజినీ చక్కగా నటించింది. ముఖ్యంగా ఇందులోని 'రాళ్లల్లో ఇసుకల్లో' అంటూ సాగే పాట సెన్సేషన్ హిట్​గా నిలిచింది.

మరోవిశేషం ఏంటంటే ఓ వైపు 'ముద్దుల క్రిష్ణయ్య' థియేటర్లలో రన్ అవుతూనే మరోవైపు ఏప్రిల్‌ 15న ఈ సినిమా విడులై ప్రేక్షకులను అలరిచింది. దీంతో ఆడియెన్స్ ఈ రెండు సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. ఇందులోని కళ్యాణ వైభోగమే పాట కూడా మంచి హిట్ అందుకుంది.

అనసూయమ్మ గారి అల్లుడు
బాలయ్య సోదరుడు నందమూరి హరికృష్ణ నిర్మించిన చిత్రం 'అనసూయమ్మ గారి అల్లుడు'. ఇందులో అనసూయమ్మగా సీనియర్ నటి శారద నటించగా, ఆమె అడుగుజాడల్లో నడిచే కూతురిగా భానుప్రియ కనిపించి మెప్పించింది. ఫన్ అండ్ ఎంటర్​టైనింగ్​గా ఉన్న ఈ చిత్రం అదే ఏడాది జులైలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా 200 రోజులు ఆడి రికార్డుకెక్కింది. అయితే ఈ మూవీ స్ర్కిప్ట్​ను పరిచూరి బ్రదర్స్‌ కేవలం ఒక్క రోజులో కంప్లీట్ చేయడం విశేషం.

దేశోద్ధారకుడు
హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య వెనువెంటనే 'దేశోద్ధారకుడు' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రం బాలయ్య ఖాతాలో మరో హిట్ పడేలా చేసింది. దీంతో అభిమానుల్లో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎంతలా అంటే విజయవాడలో బాలయ్య కోసం ఏకంగా 108 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు గల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా అప్పట్లోనే దాదాపు రూ. 5 కోట్ల వసూళ్లు సాధించింది.

కలియుగ కృష్ణుడు
ఇక అదే ఏడాది విడుదలైన 'కలియుగ కృష్ణుడు' సూపర్ హిట్ టాక్ అందుకుంది. 'బాలయ్య 30'గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 19న విడుదలైన ఓ రేంజ్​లో దూసుకెళ్లింది. ముఖ్యంగా ఇందులోని డైలాగ్స్‌కు అభిమానులను తెగ ఆకట్టుకుంది.

అపూర్వ సహోదరులు
బాలకృష్ణ డ్యూయెల్​ రోల్​లో మెరిసిన ఫస్ట్ మూవీ ఇది. రామ్‌, అరుణ్‌ ఇలా రెండు పాత్రల్లో పంచ్‌లు, ఫైట్లతో అబ్బురపరిచారు బాలయ్య. కె. రాఘవేంద్రరావు ప్రొడ్యూసర్​గా, డైరెక్టర్​గా తెరకెక్కించిన తొలి మూవీ ఇది. దసరా కానుకగా అక్టోబర్‌ 9న విడుదలైన ఈ చిత్రం. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతటా బాక్సాఫీస్ కలెక్షన్లు కురిపిస్తూ ఘనవిజయాన్ని సాధించింది.

మరోవైపు ఒకే ఏడాది రెండు హ్యాట్రిక్‌లు సాధించినందున బాలయ్యకు 1986 గోల్డెన్‌ ఇయర్‌గా నిలిచింది. దాంతో హీరో ఆఫ్‌ ది ఇయర్‌గా ఆయన చరిత్రకెక్కారు.

చిరు సినిమాల్లో బాలయ్య ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా? - Balakrishna Favourite Movie

బాలకృష్ణ అలాంటి వ్యక్తి : 'యానిమల్' విలన్ బాబీ దేఓల్​ - Bobby Deol Balakrishna NBK 109

ABOUT THE AUTHOR

...view details