Mokshagna Prasanth Varma Simba Movie : నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్ల పాటు ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన ఎంట్రీని నేడు(సెప్టెంబర్ 6) అధికారికంగా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ లాంఛ్ అవ్వనున్నట్లు అనౌన్స్ చేశారు. సుధాకర్ చెరుకూరి, తేజస్విని సంయుక్తంగా చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. PVCU సినిమాటిక్ యునివర్స్‌లో భాగంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది.
Balakrishna Cameo Role Mokshagna Movie : కానీ ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్, భారీ వీఎఫెక్స్ ఎఫెక్ట్స్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. వినోదాత్మక కథనంతో పురాణాలను టచ్ చేస్తూ దీన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. హీరోయిన్గా కొత్త అమ్మాయిని తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ మూవీలో బాలయ్య ఒక స్పెషల్ కేమియో రోల్ చేయబోతున్నారని కూడా అంటున్నారు. అది కూడా శ్రీకృష్ణుడి గెటప్‌లో క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ వచ్చే రేంజ్లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది.
వాస్తవానికి అన్‌స్టాపబుల్ షూటింగ్ సమయంలోనే ప్రశాంత్ వర్మ - బాలయ్య జర్నీ మొదలైంది. అన్‌స్టాపబుల్ కోసం ప్రశాంత్ వర్మ పని చేశారు. అప్పుడే బాలయ్యకు ప్రశాంత్ వర్మ ఓ లైన్‌ను వినిపించారట! అది బాలయ్యను ఆకట్టుకుందట!. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో బాలయ్య నమ్మకం మరింత రెట్టింపు అయింది. అందుకే ప్రశాంత్ వర్మకు బాలయ్య అవకాశాన్ని ఇచ్చారని తెలిసింది.
పైగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లాంఛ్ కోసం బాలయ్య చాలా ఏళ్ల నుంచి ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల్ని అలరించే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే అప్పటికే స్టార్ వారసుల లాంఛ్ అంతా కమర్షియల్ స్టోరీలతోనే అయింది. రామ్ చరణ్ చిరుత, మహేశ్ బాబు రాజకుమారుడు, జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని, ప్రభాస్ ఈశ్వర్ అన్నీ కమర్షియల్ ఫార్ములాతోనే రూపొందాయి. నాగ చైతన్య జోష్ మెసేజ్ ఒరియెంటెడ్గా తీసిన అంచనాలను అందుకోలేకపోయింది.