Balakrishna Bhagvant Kesari Remake :ఏదైనా సినిమా హిట్ అయితే రీమేక్ చేయడం ఎప్పుడు నుంచో ఉన్న ట్రెండే. మన హీరోలు ఇతర భాషల చిత్రాలను రీమేక్ చేస్తే అక్కడి వాళ్లు మన కథానాయకుల చిత్రాలను రీమేక్ చేసి హిట్ కొడుతుంటారు. అయితే ఇప్పుడు సౌత్‌లో బాలయ్య నటించిన ఓ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీ కోసం ముగ్గురు సౌత్ హీరోలు పోటీ పడుతున్నారని తెలిసింది.
వివరాల్లోకి వెళితే. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన బెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది భగవంత్ కేసరి. గత ఏడాది దసరా విన్నర్‌గా నిలిచిన ఈ చిత్ర రీమేక్ కోసం ప్రస్తుతం ఇతర భాషల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ముఖ్యంగా తమిళ, కన్నడలో భారీగా డిమాండ్ ఉందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
పొలిటికల్ ఎంట్రీ ముందు నిర్మాత డివివి దానయ్య నిర్మించబోయే తన చివరి చిత్రానికి ఈ కథ అయితే బాగుంటుందని విజయ్ దళపతి అభిప్రాయపడ్డారని సినీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమె జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బాలయ్య పాత్ర విజయ్‌కు బాగా నచ్చిందని అంటున్నారు. అందుకే తన ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులతో ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని విజయ్ ఆలోచిస్తున్నారట. ఇంకా దీనిపై తుది నిర్ణయమైతే తీసుకోలేదు.