Ayushmann Khurrana Instagram Post :డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ బాలీవుడ్లో సూపర్ పాపులరయ్యారు నటుడు ఆయుష్మాన్ ఖురానా. తన నటనతో పాటు గాత్రంంతోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు ఈ స్టార్ హీరో. తాజాగా ఆయన తన వైఫ్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్‌ని జయించిన ఆమె గురించి ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. దీంతో పాటు ఆమె ఫొటోలను షేర్ చేశారు.
క్యాన్సర్ డే రోజు నటుడి పోస్ట్ - భార్య గురించి ఎమోషనల్! - ఆయుష్మాన్ ఖురానా భార్య
Ayushmann Khurrana Instagram Post : ప్రపంచ క్యానర్స్ డే సందర్భంగా తన వైఫ్ గురించి ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. ఆ విశేషాలు మీ కోసం
Published : Feb 4, 2024, 4:26 PM IST
" పంజాబ్ యూనివర్శిటీలోని హట్ నంబర్ 14లో సమోసాలు, టీతో నా దాన్ని చేసుకున్న అమ్మాయి. స్పోకన్ ఫెస్ట్‌లో నీ స్పీచ్ కోసం ఆల్ ద బెస్ట్. నీ గుండె ధైర్యాన్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా' అంటూ ఆయుష్మాన్ ఎమోషనలయ్యారు
ఇక ఆయుష్మాన్, తాహిరా కశ్యప్ కాలేజీ చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2008లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటకు ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అయితే 2018లో తాహిరాకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్థరణ అయ్యింది. ఇక అప్పటి నుంటి కొంత కాలం వరకు చికిత్స తీసుకున్న ఆమె క్యాన్సర్‌ను జయించారు.