Pawan kalyan Reacts on Acting in Movies : సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ స్పందించారు. మూడు నెలల పాటు చిత్రీకరణలకు దూరంగా ఉంటానని స్పష్టత ఇచ్చారు. వీలున్నప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు షూటింగ్‌కు సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు.
ఓజీ చేస్తావా? క్యాజీ చేస్తావా? - పిఠాపురంలో తాజాగా నిర్వహించిన వారాహి సభలో అభిమానులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు పవన్ కల్యాణ్. సినిమాలపై స్పందించాలని ఫ్యాన్స్ అడగగా కీలక కామెంట్స్ చేశారు. "సినిమాలు చేసే సమయం ఉందంటారా? కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని నన్ను తిట్టకుండా ఉండాలి కదా. అందుకే ముందే చెప్పిన విధంగా పని చేస్తాను. లేదంటే నిన్ను ఎన్నుకుంటే నువ్వెళ్లి ఓజీ చేస్తావా? క్యాజీ చేస్తావా అంటే నేనేమని సమాధానం చెప్పాలి. చిత్రీకరణ విషయంలో క్షమించమని ప్రొడ్యూసర్లను కోరాను. ఏపీ ప్రజలకు సేవ చేసుకుంటూ వీలున్నప్పుడు నటిస్తానని చెప్పాను. ఓజీ సినిమా బాగుంటుంది" అని అభిమానుల్లో జోష్ నింపారు పవన్ కల్యాణ్.
Pawan kalyan Upcoming Movies : కాగా, పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం ఓజీ(దర్శకుడు సుజీత్), హరిహర వీరమల్లు( దర్శకుడు క్రిష్), ఉస్తాద్ భగత్ సింగ్(దర్శకుడు హరీశ్ శంకర్) వంటి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా, పవన్ కల్యాణ్ డేట్స్ దొరకక ఆయా చిత్రాల షూటింగ్ వాయిదా పడ్డాయి. ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిచిపోయాయి.