తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రజనీ కాంత్‌ 'వేట్టాయన్' - ఒకే థియేటర్‌లో సినిమా చూసిన ధనుశ్​, ఐశ్వర్య

'వేట్టాయన్'​ సినిమాను రజనీకాంత్ కుటుంబసభ్యులతో వీక్షించిన హీరో ధనుశ్​!

source ETV Bharat
Dhanush Rajinikanth Aishwarya (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2024, 3:04 PM IST

Vettaiyan Movie Review Dhanush : సూపర్ స్టార్ రజనీ కాంత్‌ నటించిన లేటెస్ట్ మూవీ వేట్టాయన్‌. టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ దక్కించుకుంది. ఫ్యాన్స్ సినిమా బాగుంది అంటూ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులతో కలిసి చెన్నైలోని ఓ థియేటర్‌లో హీరో ధనుష్‌ కూడా వేట్టాయన్‌ సినిమాను వీక్షించారు. ఇదే థియేటర్‌లో రజనీ కాంత్‌ కుటుంబ సభ్యులు కూడా సందడి చేశారు. రజనీ కాంత్‌ సతీమణి లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఇదే థియేటర్లలో‌ సినిమా చూసినట్లు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఐశ్వర్య, ధనుష్‌ ఒకే థియేటర్లో సినిమా చూడటంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విడిపోయిన వారిద్దరూ మళ్లీ తిరిగి కలిస్తే బాగుండని ఆశిస్తున్నారు.

కాగా, హీరో ధనుష్‌కు రజనీ కాంత్‌ అంటే ఎంతో ఇష్టమో తెలిసిన విషయమే. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని తెలియజేశారు. 2004లో రజనీ కాంత్​ కుమార్తె ఐశ్వర్యను ధనుష్‌ పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల కారణంగా పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు. అలా ఈ జంట 2022లో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే విడాకుల కోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. కానీ రీసెంట్​గా జరిగిన జరిగిన విచారణకు ఈ జంట హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం మరో రోజుకు విచారణ వాయిదా వేసింది.

అనిరుధ్‌ ఆనందం - ధనుశ్​తో పాటు ఇదే థియేటర్‌లో వేట్టాయన్ సినిమా వీక్షించారు సంగీత దర్శకుడు అనిరుధ్‌. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రివ్యూలపై హర్షం వ్యక్తం చేశారు. "జైలర్‌ తర్వాత మరోసారి రజనీ కాంత్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. మూవీ రిజల్ట్‌ ముందే ఊహించి నేను ట్వీట్‌ చేశానంటే అది తప్పకుండా సక్సెక్​ అవుతుందని అంతా భావిస్తున్నారు. అందుకు ఆనందంగా ఉంది" అని అనిరుధ్​ చెప్పారు. సినిమా చూసిన తర్వాత కూడా ఆనందం వ్యక్తం చేస్తూ పోస్ట్‌ పెట్టారు అనిరూధ్​. మరోసారి తన జోస్యం నిజమైనందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

'వేట్టయన్‌' తెలుగు టైటిల్ పెట్టకపోవడంపై కాంట్రవర్సీ - స్పందించిన నిర్మాణ సంస్థ

'వార్​ 2' - ఎన్టీఆర్​, హృతిక్​తో పాటు మరో ఇద్దరు హీరోలు?

ABOUT THE AUTHOR

...view details