తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అతడితో ప్రేమలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి - ఫొటో షేర్ చేసిన ప్రియుడు! - tripti dimri sam merchant

Animal Heroine Tripti Dimri Lover : 'యానిమల్‌' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ యాక్టర్​గా మారిపోయిన బ్యూటీ త్రిప్తి డిమ్రి ప్రేమలో పడిందని తెలిసింది. ఇంతకీ అతడెవరంటే?

అతడితో ప్రేమలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి - ఫొటో షేర్ చేసిన ప్రియుడు!
అతడితో ప్రేమలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి - ఫొటో షేర్ చేసిన ప్రియుడు!

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 10:15 AM IST

Animal Heroine Tripti Dimri Lover :'యానిమల్‌' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ యాక్టర్​గా మారిపోయిన బ్యూటీ త్రిప్తి డిమ్రి. ఇండస్ట్రీలో ఇప్పుడ ఈ ముద్దుగుమ్మ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో తన బోల్డ్ యాక్టింగ్​తో న్యూడ్​గా నటించి కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది. 'జోయ' పాత్రలో లక్షల మంది యువత మనసును దోచేసింది. అలానే ఐఎండీబీ (ఇండియన్‌ మూవీ డేటాబేస్‌) రీసెంట్​గా రిలీజ్ చేసిన మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్ల లిస్ట్​లోనూ మొదటి స్థానంలో నిలిచింది. అంతలా యానిమల్‌ చిత్రంతో ఆకట్టుకున్న ఈమెకు ఇప్పుడు వరుస అవకాశాలను క్యూ కడుతున్నాయని తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం అఫీషియల్​గా ఇంకా ఏ సినిమాను అనౌన్స్ చేయలేదుయ

అయితే ఫిబ్రవరి 23న త్రిప్తి డిమ్రి రోజు(Heroine Tripti Dimri Birthday). తన 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెకు తన రూమర్ బాయ్ ఫ్రెండ్​ సామ్ మర్చంట్ కూడా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు. త్రిప్తితో తీసుకున్న సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. నా ప్రియమైన త్రిప్తికి శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి దిగిన సెల్ఫీ నెట్టింట మస్త్​ వైరల్‌ అవుతోంది. దీంతో త్రిప్తి డిమ్రి లవ్ మ్యాటర్​ మరోసారి తెరపైకి వచ్చింది.

Who is Sam Merchant : ఇక ఈ సామ్ మర్చంట్ ఎవరు ? అంటూ నెటిజన్లు, త్రిప్తి డిమ్రి అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో బయట దొరికిన సమాచారం ప్రకారం సామ్‌మర్చంట్‌ మొదట మోడల్‌గా పనిచేశాడు. ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. గోవాలో అతడికి బీచ్‌ క్లబ్స్‌తో పాటు పలు హోటల్స్‌ ఉన్నాయని సమాచారం అందింది. అయితే ఇప్పటివరకు త్రిప్తి డిమ్రి - సామ్​ మర్చంట్​ తమ మధ్య ఉన్న రిలేషన్‌ షిప్‌ గురించి అధికారికంగా అనౌన్స్ చేయలేదు.

అతడితో ప్రేమలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి

చాలా రోజుల తర్వాత బికినీలో సమంత - నీటి కొలనులో జలకాలాడుతూ!

అసిస్టెంట్ డైరెక్టర్​ టు రూ.100 కోట్ల స్టార్ - అందరు హీరోల్లా నాని చేయకపోవడానికి కారణం ఇదే!

ABOUT THE AUTHOR

...view details