Pushpa 2 Animal Saurabh Sachdeva : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప 2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు సుకుమార్ భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమాలో నటిస్తున్న నటుడు బ్రహ్మాజీ తాజాగా తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తైందని తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. కొన్ని ఫొటోలను అందులో జోడిస్తూ దీన్ని పంచుకున్నారు. ఇందులో బ్రహ్మాజీతో పాటు దర్శకుడు సుకుమార్, మలయాళ స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్, యానిమల్ ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ కనిపించారు.
ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు బ్రహ్మాజీ పోస్ట్‌పై స్పందిస్తూ సుకుమార్ భారీగా ప్లాన్ మాములుగా లేదుగా అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. కాగా, యానిమల్‌లో విలన్ బాబీ దేవోల్‌కు సోదరుడిగా నటించి ఆకట్టుకున్నారు సౌరభ్.
పుష్ప : ది రైజ్‌కు కొనసాగింపుగా రానుంది పుష్ప : ది రూల్ (పుష్ప 2). రష్మిక శ్రీవల్లిగా అంటే పుష్పకు భార్యగా కనిపించనుంది. మొదటి భాగంలో ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా కనిపించి మెప్పించారు. రెండో భాగంలో భన్వర్ సింగ్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇంకా సినిమాలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంటున్న అనసూయ, కమెడియన్ సునీల్, ధనంజయ్ సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.