తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్య పెట్టిన ఆ ఒక్క మెసేజ్ - షోలోనే ఏడ్చేసిన యాంకర్ ఉదయభాను! - Balakrishna Udaya bhanu - BALAKRISHNA UDAYA BHANU

Anchor UdayaBhanu Balakrishna : బాలకృష్ణ గురించి యాంకర్ ఉదయభాను మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యారు! బాలయ్య చేసిన ఓ పనిని గుర్తు తెచ్చుకుని స్టేజ్​పైనే ఏడ్చేశారు. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
balakrishna udaya bhanu (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 2:13 PM IST

Anchor UdayaBhanu Balakrishna :టాలీవుడ్ హీరో బాలకృష్ణ అంటే ఆయన ఫ్యాన్స్​కే కాదు, ఇండస్ట్రీలో చాలా మందికి ఎంతో గౌరవం. అందుకు కారణం బాలకృష్ణ ఇండస్ట్రిలో ఏ స్థాయి వారినైనా సమానంగా ట్రీట్ చేస్తూ ఉండటమే అని చాలా మంది చెప్పటం ఇప్పటికే చూశాం. ఇదే విషయాన్ని అప్పట్లో టీవిలో ఒక డాన్స్ షోకు యాంకర్​గా చేస్తున్న ఉదయభాను కూడా చెప్పారు! అయితే బాలయ్య పెట్టిన ఆ మెసేజ్​ను తలుచుకుని బాగా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యాబ్​లో చక్కర్లు కొడుతోంది.

"ఒక ఆడపిల్లగా నా జీవితంలో ఎలాంటి సరదాలు లేవు. అయితే నా వాళ్లు అందరూ నాకు దూరమవడం నాకు దేవుడి మీద నమ్మకం కోల్పోయేలా చేసింది. కానీ మళ్లీ ఆ దేవుడే నాకు ఒకరు కాదు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. నా జీవితంలో మొదటి పండగ వాళ్లిద్దరి మొదటి పుట్టినరోజు. నేను నాకు తెలిసిన చాలామందికి ఫోన్ చేశాను. ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. బాలకృష్ణ గారికి ఇలా పుట్టినరోజని మెసేజ్ పెట్టాను. కాసేపటి తర్వాత ఆయన కాల్ బ్యాక్ చేశారు. ఫలానా రోజు రాత్రి ఏడున్నర గంటలకు అని చెప్పగానే అనంతపురంలో మీటింగ్ ఉంది పర్లేదు రాత్రి ట్రావెల్ చేస్తాను అన్నారు. అలా ఆయన మా పిల్లల పుట్టినరోజుకు రావడం నాకు సింహం అలా నడిచి వచ్చినట్టు అనిపించింది. అయితే ఏదో వచ్చాం అన్నట్టు కాకుండా దాదాపు 45 నిమిషాలు ఉండి అందరితో ఫోటోలు దిగి వెళ్లారు. హ్యాట్స్ ఆఫ్ బాలయ్య. జై బాలయ్య" అంటూ ఎమోషనల్ అయ్యారు యాంకర్ ఉదయభాను.

ఇకపోతే బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్​లో unstoppable అనే షోకు యాంకర్​గా వ్యవహరించి పలువురు సెలబ్రిటిలను ఇంటర్వ్యూ చేశారు. తనదైన స్టైల్​ యాంకరింగ్​తో నవ్వులు పూయిస్తూనే సెలబ్రిటీలకు సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను కూడా బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన ఎన్​బీకే 109 సినిమాలో నటిస్తున్నారు. దీనికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

క్రికెట్ బాల్​తో స్టార్ హీరో పళ్లు విరగొట్టిన జాన్వీ! - Janvi Kapoor

ఇండియన్​ సినిమాలో అత్యంత కాస్ట్లీగా 'రామాయణ్'​ - ఒక్క భాగానికే రూ.835కోట్లా? - Ramayan Movie

ABOUT THE AUTHOR

...view details