Ananya Nagalla Tantra movie OTT :ఓటీటీలో మిస్ట్రరీ థ్రిల్లర్స్‌తో పాటు హారర్ ఫిల్మ్‌కు మస్త్ క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు వీటిని మంచి ఆసక్తిగా చూస్తుంటారు. అందుకే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కూడా వీటిని ప్రత్యేకంగా విడుదల చేస్తుంటాయి. అలా తెలుగులో వచ్చిన రీసెంట్ సినిమా తంత్ర. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌లో నటించిన తెలుగందం నటి అనన్య నాగళ్ల ఈ తంత్రలో ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో అనన్య నాగళ్లతో పాటు సీనియర్ నటి సలోని, మీసాల లక్షణ్, టెంపర్ వంశీ కూడా ఇతర పాత్రల్లో కనిపించారు.
మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం టాక్ పరంగా మంచి రెస్పాన్సే దక్కించుకున్నా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. వసూళ్లు అంతగా రాలేదు. కానీ ఈ సినిమాలో భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయంటూ రివ్యూస్ వచ్చాయి. అందుకే ఈ చిత్రంపై ఓటీటీ ఆడియెన్స్‌కు మంచి ఇంట్రెస్ట్ కలిసింది.
అయితే ఇప్పుడీ సినిమా రిలీజై నెల రోజులు కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ కొనుగోలు చేసింది. తాజాగా దీన్ని ఏప్రిల్ 5 అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్కు వదిలింది. కాబట్టి, థియేటర్లలో మిస్ అయిన వారు ఉంటే ఈ తంత్ర చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి.