తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అమీ జాక్సన్ ఎంగేజ్​మెంట్​- ఏకంగా కొడుకుతోనే గ్రాండ్ ఎంట్రీ! - Amy Jackson Engagement - AMY JACKSON ENGAGEMENT

Amy Jackson Engagement : 'మదరాసపట్నం' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అమీ జాక్సన్​. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్​లో ఎన్నో సినిమాల్లో మెరిసింది. తాజాగా ఈ భామ తన బాయ్​ఫ్రెండ్ ఎడ్ వెస్ట్​విక్​తో జరిగిన ఎంగేజ్మెంట్ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలను మీరూ ఓ లుక్కేయండి.

Amy Jackson Engagement
Amy Jackson Engagement

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 4:35 PM IST

Amy Jackson Engagement :'ఎవడు' సినిమా ద్వారా టాలీవుడ్​కు పరిచయమైంది యంగ్ బ్యూటీ అమీ జాక్సన్​. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది, ఆ తర్వాత ఆ తర్వాత 'అభినేత్రి', 'రోబో 2.0' వంటి చిత్రాలతో ఆడియెన్స్​ను మరించ చేరువైంది. ఇక తెలుగు నుంచి నెమ్మదిగా కోలీవుడ్​లోకి అడుగుపెట్టింది. అక్కడ తాండవమ్​', 'తంగ మగన్'(తెలుగులో నవమన్మదుడు​) 'ఐ', 'తెరి', 'సింగ్ ఈజ్​ బ్లింగ్​', లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తర్వాత బాలీవుడ్​లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే '2.0' సినిమా తర్వాత వెండితెరకు దూరమైంది. కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి 2024లో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఫారిన్​లో ఉన్న ఆమె 'మిషన్ చాప్టర్​ 1', 'క్రాక్' అనే రెండు సినిమాల్లో కనిపించింది. అయితే ఇప్పుడు ఈ చిన్నది తన లైఫ్​లో మోస్ట్​ మెమరెబల్ మూమెంట్​ను ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంది.

మార్చి 21న జరిగిన తన నిశ్చితార్దపు వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్​లోడ్ చేసింది. "మా ప్రేమను ఇలా ప్రపంచం ముందు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది" అంటూ క్యాప్షన్​ను జోడించింది. ఇక వాటిలో తన బాయ్​ఫ్రెండ్ ఎడ్ వెస్ట్​విక్​తో కలిసి అమీ రొమాంటిక్​గా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇక అమీ లవ్​స్టోరీ గురించి చూస్తే - అమీ జాక్సన్ 2022లో సోషల్ మీడియా వేదికగా ఎడ్​ వెస్ట్​విక్​తో తన బంధాన్ని అఫిషియల్​గా అనౌన్స్ చేసింది. ఆయన ఓ హాలీవుడ్​ నటుడు. 'గాసిప్ గర్ల్', 'వైట్ గోల్డ్' వంటి సిరీస్​తో గుర్తింపు తెచ్చుకున్నారు. 'సన్ ఆఫ్ రాంబో', 'మీ యు మ్యాడ్​నెస్' వంటి సినిమాల్లోనూ నటించారు. అయితే వెస్ట్​విక్​తో రిలేషన్​షిప్​కు ముందు అమీ 2019లో జార్జ్ పనాయోటౌ అనే యుకేకి చెందిన బిజినెస్ మ్యాన్​తో ప్రేమబంధంలో ఉండేది. అదే ఏడాది సెప్టెంబర్​లో ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. అయితే 2021లో తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించింది.

కాజల్​ అగర్వాల్​ టు అమీ జాక్సన్​.. తల్లులైనా తగ్గేదే లే.. అదే అందం అదే ఫిజిక్​

కొత్త బాయ్‌ఫ్రెండ్​తో అమీ జాక్సన్​ చిల్​.. అలా చేస్తున్న​​ ఫొటోలను పోస్ట్​ చేసి..

ABOUT THE AUTHOR

...view details