Ambajipeta Marriage Band Collections:యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. కలర్‌ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో విజయం సొంతం చేసుకున్న ఈ హీరో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఇక రీసెంట్గా 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్ మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
డైరెక్టర్ దుశ్యంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్‌గా నిలిచింది. మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.8.06 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఈ క్రమంలో రిలీజైన మూడో రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకుంది. దీంతో 2024లో హను-మాన్, నా సామిరంగ తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అందుకున్న మూడో సినిమాగా 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' రికార్డు సొంతం చేసుకుంది. ఇక సినిమా విజయం సాధించడం వల్ల మూవీటీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.
Ambajipeta Marriage Band Overseas Collection: దేశవ్యాప్తంగానే కాకుండా ఈ సినిమాకు ఓవర్సీస్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. మూడు రోజుల్లో ఓవర్సీస్లో 1,50,000 డాలర్లు కలెక్షన్లు సాధించినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం వల్ల లాండ్ రన్లో ఇంకా ఎక్కువ వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.