Pushpa 2 Megastar Chiranjeevi : ప్రస్తుతం భారతీయ చిత్ర సీమలో పుష్ప : ది రూల్ హవానే నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంపై సినీ పియుల నుంచి ప్రముఖల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే 'పుష్ప 2' మూవీ టీమ్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. దర్శకుడు సుకుమార్, మైత్రీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి, సీఈవో చెర్రీలు చిరు ఇంటికి వెళ్లారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా 'పుష్ప 2' విశేషాలను చిరంజీవి మూవీ టీమ్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే పుష్ప 2ను తెరకెక్కించిన సుకుమార్, తన తర్వాతి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యేలోగా దర్శకుడు సుకుమార్ పూర్తి స్క్రిప్ట్‌ను రెడీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.
"గొప్ప పని కోసం శక్తిమంతమైన శక్తులు మళ్లీ కలుస్తున్నాయి" అంటూ గుర్రం బొమ్మ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మరింత కలర్ ఫుల్ చేసేందుకు RC17 రానుందని పేర్కొన్నారు. గతంలో సుకుమార్ - చరణ్ కాంబోలో రిలీజైన 'రంగస్థలం' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.