Pushpa 2 Collections Record Break : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకుంటూ అదరగొడుతోంది. డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఐదు రోజుల్లోనే రూ.900 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.922 కోట్ల గ్రాస్ సాధించినట్లు మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "రూ.900 కోట్లు సాధించిన అత్యంత వేగంగా అందుకున్న సినిమా ఇది. ఇండియన్ సినిమాలోనే రికార్డ్ బ్రేకింగ్ ఫిల్మ్." అని రాసుకొచ్చింది.
'పుష్ప 2' - ఇండియన్ సినిమాలో ఆల్టైమ్ రికార్డ్! - 5 రోజుల్లో రూ.922 కోట్లు - PUSHPA 2 COLLECTIONS
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' కలెక్షన్స్ వివరాలివీ.

Pushpa 2 Collections Record Break (source ETV Bharat)
Published : Dec 10, 2024, 6:46 PM IST