Pushpa 2 Bollywood Collections : దాదాపు రెండు వారాలుగా 'పుష్ప 2' థియేటర్లలను హోరెత్తిస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో పాటు భారీ వసూళ్లను అందుకుంటోంది. ఇంకా చెప్పాలంటే తెలుగుతో పోలిస్తే ఈ సినిమా హిందీలో నెక్ట్స్ లెవల్లో దూసుకుపోతోంది. సెకండ్ వీకెండ్లోనూ థియేటర్లలో అదరగొడుతోంది. సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తోంది.
అయితే ఈ 'పుష్ప 2' ఇప్పుడు కేవలం 13 రోజుల్లోనే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. సోమవారం దాదాపు రూ.582 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, మంగళవారం నాటికి రూ. 601.50 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను అందుకుంది. దీంతో అల్లు అర్జున్ సినిమా హిందీలో రెండో అతి పెద్ద సినిమాగా ఆల్ టైమ్ రికార్డును అందుకుంది.
ఇప్పటివరకు ఈ రికార్డు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్ పేరిట ఉంది. ఈ చిత్రం ఫుల్ రన్ టైమ్ కలెక్షన్స్ రూ.584 కోట్లు. ఆ తర్వాత రూ.627 కోట్లతో 'స్త్రీ 2' నిలిచింది. ఇప్పుడు 'పుష్ప 2' కేవలం 13 రోజుల్లోనే రూ.601 కోట్ల మార్క్‌కు చేరువైంది. హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. రెండో వారం వర్కింగ్ డే మంగళవారం నాడు రూ. 19.50 కోట్ల నెట్ అందుకున్న సినిమాగానూ పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డును తన పేరిట నమోదు చేసింది.