Allu Arjun Pushpa 2 1000 Crores Collections : ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 'పుష్ప 2' మరో కొత్త రికార్డును అందుకుంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. తద్వారా వేగంగా రూ.1000 కోట్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ.1002 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటనకు, సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ఈ ఘనత దక్కిందని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాపై ప్రశంశలు కురిపిస్తున్నారు.
కాగా, ఇప్పటివరకు రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడానికి బాహుబలి 2కు 10 రోజులు పట్టింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2 సినిమాలు 16 రోజుల్లో ఈ మార్క్‌ను టచ్ చేశాయి. కల్కి 2898 ఏడీ సినిమాకు 15 రోజులు పట్టింది. బాలీవుడ్లో షారుక్ ఖాన్ నటించిన జవాన్‌కు 18 రోజులు పట్టగా, పఠాన్‌కు 27 రోజుల సమయం పట్టింది. కానీ ఇప్పుడు పుష్ప 2 కేవలం ఆరు రోజుల్లోనే ఈ రూ.1000 క్లబ్‌లో చేరి ఆల్ టైమ్ రికార్డ్‌ను సెట్ చేసింది.
మరో విషయమేమిటంటే బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్, కల్కి 2898 ఏడీ తర్వాత ఇంతటి భారీ వసూళ్లు అందుకున్న తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. అలానే తొలి రోజు అత్యధిక వసూళ్లు (రూ. 294 కోట్లు) సాధించిన ఇండియన్ ఫిల్మ్‌గానూ పుష్ప 2 రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.