Allu Arjun Happy Birthday :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్‌కు ఫ్యాషన్ ఐకాన్. హీరోల్లో డ్యాన్స్‌కు కేరాఫ్ అడ్రెస్. అలానే తన భిన్నమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే నేడు(ఏప్రిల్ 8) ఆయన పుట్టినరోజు.1982 ఏప్రిల్ 8న జన్మించారు. ఈయన అలనాటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడు, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనయుడు.
బాలనటుడిగా రెండు మూడు చిత్రాలు చేసిన బన్నీ ఆ తర్వాత 2002 చిరంజీవి డాడీ సినిమాలో ఓ టీనేజర్ పాత్రలో మెరిశారు. అనంతరం 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా మారారు. 2004లో వచ్చిన ఆర్య సినిమా డైరెక్టర్‌గా సుకుమార్‌కే కాదు బన్నీ కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆపైన హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన చేసిన ప్రతి సినిమా ఆయన్ను టాలీవుడ్ స్టార్ హీరోను చేసింది. అయితే బన్నీ స్టార్ డమ్ తెలుగుకే పరిమితం కాలేదు. మలయాళంలో కూడా బన్నీ సినిమాలు సూపర్ హిట్ అయ్యి అక్కడి అభిమానులు మల్లు అర్జున్ అని పిలుచుకునే స్థాయికి చేరింది.
అయితే ఈ 20ఏళ్ల కేరీర్లో బన్నీ నటనతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ యాప్‌లో ఒక్క ఫొటో పోస్ట్‌తో 1 మిలియన్ ఫాలోవర్ అందుకున్న తొలి యాక్టర్ బన్నీనే. ఇన్‌స్టాగ్రామ్ డాక్యుమెంటరీ వీడియో చేసిన మొదటి హీరో కూడా అల్లు అర్జునే కావడం విశేషం. ఇందులో పుష్ప 2 సెట్స్‌తో పాటు బన్నీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని చూపించారు.
యూట్యూబ్‌లోనూ ఆయన సెన్సేషనల్ రికార్డ్స్ సాధించారు. బోయపాటి బన్నీ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు యూట్యూబ్‌లో 300 మిలియన్ల వ్యూస్ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
బన్నీని పాన్ ఇండియా స్టార్‌గా చేసిన పుష్ప సినిమా ఆడియో ఆల్బమ్ కూడా యూట్యూబ్‌లో 5 బిలియన్ల వ్యూస్ దాటి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఈ మార్క్ అందుకున్న మొదటి ఇండియన్ ఆల్బమ్ పుష్పనే. ఇంకా ఈ సినిమా దేశవ్యాప్తంగా బన్నీకి అభిమానులను సంపాదించిపెట్టడమే కాకుండా తెలుగు వాళ్లకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన నేషనల్ అవార్డు అల్లు అర్జున్‌కు తెచ్చిపెట్టింది. బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు యాక్టర్ బన్నీనే కావడం విశేషం.