తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రణ్​బీర్ కపూర్​ కాకుండా అలియా భట్​ డార్లింగ్​ ఎవరో తెలుసా? - ALIABHATT DARLING SHAHRUKH KHAN

తన లైఫ్​లో బిగ్గెస్ట్ డార్లింగ్​ ఎవరో చెప్పిన అలియా భట్!

Aliabhatt
Aliabhatt (source Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 9:17 AM IST

Sharukh Khan Aliabhatt : ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ అలియా భట్ వరుస సినిమాలు చేస్తూ జోరు కొనసాగిస్తోంది. పెళ్లి, డెలివరీ తర్వాత కూడా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే ఆమె తన లైఫ్​లో బిగ్గెస్ట్ డార్లింగ్​ ఎవరో తెలిపింది. తన భర్త రణబీర్ కపూర్ పేరు చెప్పకుండా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పేరు చెప్పి బాద్ షా ఫ్యాన్స్​ను సర్​ప్రైజ్ చేసింది.

ఎప్పుడు చెప్పిందంటే? - అలియా - షారుక్ ఖాన్‌ కలిసి పలు సార్లు స్టేజ్​, స్క్రీన్​ను షేర్​ చేసుకున్నారు. అలా పలు సందర్భాల్లో షారుక్​పై అలియా భట్​ తన అభిమానాన్ని చాటుకుంది. అలా ఓ సారి గతంలో 'డార్లింగ్స్' ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్​ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అలియా. ఆ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ కాకుండా బాలీవుడ్‌లో మీకు బిగ్గెస్ట్ డార్లింగ్ ఎవరనే ప్రశ్న అడగగా, దానికి నవ్వుతూ "రణబీర్ కాకుండా బాలీవుడ్​లో నా బిగ్గెస్ట్ డార్లింగ్ అంటే అది కచ్చితంగా షారుక్​ ఖానే " అని చెప్పింది. కాగా, 'డార్లింగ్స్' సినిమాను అలియా భట్ సొంత బ్యానర్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్, షారుక్​ బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.

2024లోనూ ఓ ఇంటర్వ్యూలో షారుక్​పై ప్రశంసలు కురిపించింది అలియా. ఇండియన్ సినిమా అంటే తనకు మొదటగా గుర్తొచ్చేది షారుకేనని చెప్పింది. 'దిల్వాలే దుల్హానియా లే జాయేంగే'లో కాజల్​తో ఉంటే పలట్​ సీన్ తనకు చాలా ఇష్టమని తెలిపింది. ఆ సీన్ ప్రతి ఒక్క అమ్మాయి తన జీవితంలో జరగాలని కోరుకుంటారని మనసులో మాట బయటపెట్టింది. "ప్రతి అమ్మాయి తన జీవితంలో అలాంటి సీన్ జరగాలని కోరుకుంటుంది. వెనక్కు తిరిగి చూసేసరికి ఒక అబ్బాయి తన చూపు కోసం ఎదురుచూస్తూ ఉండటం అందరికీ కావాలనిపించే సంఘటనే" అన్నారు అలియా.

ఇకపోతే అలియా మొదటిసారి షారుక్​తో కలిసి 2016లో తెరకెక్కిన 'డియర్ జిందగీ'లో కలిసి నటించింది. ఆ తర్వాత షారుక్​ సినిమా 'జీరో' లోనూ కనిపించగా, అలియా భట్ హీరోయిన్​గా నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో గెస్ట్ రోల్ కనిపించారు షారుక్​.

అలియా ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికొస్తే, ఆమె స్పై యూనివర్స్ ఫిల్మ్ 'ఆల్ఫా'తో బిజీగా ఉన్నారు. అందులో షర్వారీ, బాబీ దేఓల్​తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ్ రవళీ దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మాత. 2025 డిసెంబర్ 25న రిలీజ్ చేయాలనేది మూవీ యూనిట్ ఆలోచన.

చిత్ర పరిశ్రమలో అలా జరగాలని కోరుకుంటున్నా : సమంత

8 నెలల క్రితం చనిపోయిన అమ్మాయితో హీరో ప్రేమ! - ఈ వారం థియేటర్/OTT సినిమాలివే

ABOUT THE AUTHOR

...view details