తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నా బాడీ, నా ఇష్టం - మీరెవరు జడ్జ్​ చేయడానికి!?' - వారిపై మండిపడ్డ అలియా భట్​ - ALIA BHATT COSMETIC SURGERY

అందం కోసం తాను కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన హీరోయిన్ అలియా భట్​!

Alia Bhatt Slams cosmetic surgery Rumours
Alia Bhatt Slams cosmetic surgery Rumours (source Associated Press and ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 1:12 PM IST

Alia Bhatt Slams cosmetic surgery Rumours :బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అందం కోసం కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో వీడియోలు, ఆర్టికల్స్ రావడంపై ఆమె ఎక్స్ ట్విటర్ ద్వారా తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. "సెలబ్రెటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. నేను సర్జరీ చేయించుకున్నాను చేయించుకోలేదు అనేది పూర్తిగా నా వ్యక్తిగతం. నా బాడీ, నా పర్సనల్. ఈ విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా వ్యక్తిగత జీవితంలో అందం గురించి తీసుకునే ప్రికాషన్స్ గురించి మీకేం అవసరం. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోన్న నా వీడియోలు చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి. ఆ వీడియో క్రియేట్ చేసిన వారి దృష్టిలో నా నవ్వు వంకరగా ఉంటుంది. నేను మాట్లాడే విధానం మరోలా ఉంటుంది. నేను అందం కోసం సర్జరీలు చేయించుకున్నాను. అలాగే వారి దృష్టిలో నాకు పక్షవాతం కూడా వచ్చింది. ఎలాంటి ప్రూఫ్​లు లేకుండా ఇలాంటి రూమర్స్ సృష్టించి మీరంతా తమాషాలు చేస్తున్నారా? ఎలాంటి ప్రూఫ్‌ లేకుండా ఎదుటి వారి ఇలాంటి అసభ్య కామెంట్స్ చేయడం నేరమని మీకు తెలీదా? కేవలం వ్యూస్‌ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇలా కామెంట్స్‌ చేసే వారిలో మహిళలు కూడా ఉండడం సిగ్గుచేటు అని చెప్పాలి. ఈ పద్ధతి ఎప్పటికైనా హానికరమే" అని పేర్కొన్నారు. కాగా, అలియా పెట్టిన ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు.

ఇకపోతే గతంలోనూ చాలా మంది హీరోయిన్లు అందంగా కనిపించడానికి లిప్స్, ఇతర భాగాల్లో సర్జరీలు చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. అలియా భట్ కూడా ఇలాగే కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందని తరచుగా వార్తలు రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా, అలియా భట్ ప్రస్తుతం అల్ఫా సినిమా షూటింగ్​లో బిజీ బిజీగా గడుపుతోంది. కశ్మీర్ బ్యాక్​డ్రాప్​లో వస్తున్న ఈ చిత్రంలో తనతో పాటు షార్వారీ కూడా నటిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ మూవీకి శివ దర్శత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రీసెంట్​గానే అలియా భట్ నటించిన జాగ్రా మూవీ అక్టోబర్ 11న థియేటర్లలో విడుదలై మిక్స్​డ్​ టాక్​ అందుకుంది.

ABOUT THE AUTHOR

...view details