Bimbisara Chiranjeevi Ajith Kumar Wife : కొన్నిసార్లు పాత ఫొటోలు చూసినప్పుడు అప్పటి పాత మధుర జ్ఞాపకాలు మదిలో మెదులుతుంటాయి. కాలం ఎంత వేగంగా కదిలిపోయింది కదా, అప్పుడే అన్నేళ్లు గడిచిపోయాయా అని అనిపిస్తూనే మళ్లీ తిరిగి ఆ రోజులు వస్తే బాగుంటది అనుకుంటాం. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి ఓ పాత ఫొటోనే తెగ వైరల్ అవుతోంది.
అదేంటంటే? - ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిని విశ్వంభర సెట్స్‌లో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటో సోషల్ మీడియాలో అప్పుడు బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా అజిత్ భార్య షాలిని కూడా ఓ పాత ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పిక్‌ను పోస్ట్ చేశారు. ఇందులో తన సోదరి షామ్లీ, సోదరుడు రిచర్డ్ రిషి కూడా ఉన్నారు. అది అభిమానులను ఆకకట్టుకుంటోంది.
అలానే ఇక్కడ అభిమానులను ఆశ్చర్యపరిచే మరో విషయమేమిటంటే ఈ చిత్రంలో ఉన్న ముగ్గురూ చిరంజీవి బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)లో నటించినవారే. అంటే దాదాపు 34 ఏళ్ల తర్వాత ఈ ముగ్గురు మరోసారి మెగాస్టార్‌ను కలిశారన్నామాట. షాలినితో పాటు షామిలి, రిషి కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి షూటింగ్ సమయంలో దిగిన ఫొటోను, ఇప్పుడు తీసుకున్న ఫొటోను కొలైజ్ చేసి పంచుకున్నారు. ఇప్పుడీ ఫొటోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.