Pattudala Trailer : స్టార్ హీరో అజిత్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'విదాముయార్చి'. దర్శకుడు మగిజ్ తిరుమేని ఈ సినిమా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు 'పట్టుదల' అనే తెలుగు టైటిల్ ఖరారు చేశారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఉన్న ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లను డైరెక్టర్ మగిజ్ తిరుమేని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది.
కాగా, ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు అర్జున్, యంగ్ బ్యూటీ రెజీనా కసాంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమాతోపాటు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రాజెక్ట్ కోసం కూడా అజిత్ కష్టపడుతున్నారు.