Ajith Kumar Racing Team :కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్తాజాగా తన రేసింగ్ టీమ్‌ను ప్రకటించారు. 'అజిత్ కుమార్ రేసింగ్' అనే పేరుతో టీమ్‌ను ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా దుబాయ్ ఆటోడ్రోమ్‌లో ఫెరారీ 488 ఈవీఓను అజిత్ టెస్ట్ డ్రైవ్ చేసిన ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు. ఈ రేసింగ్ టీమ్ వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటుందంటూ ఆ సంస్థ అధికారులు తెలిపారు. ఈ టీమ్‌కు ఫాబియన్ డిఫియక్స్ అఫిషియల్ డ్రైవర్‌గా వ్యవహరించనున్నారు. దీని ద్వారా ట్యాలెంటడ్ యువతను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని వారు తెలిపారు. అదే సమయంలో రేసింగ్ ప్రోగ్రామ్‌కు కూడా మద్దతు తెలుపుతున్నామన్నారు. త్వరలోనే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు పంచుకోనున్నట్లు పేర్కొన్నారు.
13 ఏళ్ల తర్వాత మోటార్ రేసింగ్‌లోకి
2025లో జరగనున్న యూరోపియన్ జీటీ4 ఛాంపియన్‌షిప్‌లో అజిత్ టీమ్ పాల్గొంటుందంటూ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎంఎస్‌సీఐ) తాజాగా ప్రకటించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత అజిత్ మళ్లీ ఈ మోటార్ రేసింగ్‌లోకి రావడం తమకు సంతోషంగా ఉందంటూ ఎఫ్‌ఎంఎస్‌సీఐ అధ్యక్షుడు అక్బర్ ఇబ్రహీం పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఔత్సాహికులైన మహిళల కోసం వీనస్ మోటార్ సైకిల్స్ శిక్షణ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అజిత్ ఈ స్టార్టప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.