Actor Ajith Birthday :కోలీవుడ్ స్టార్ హీరో నేడు ( మే 1)న 53 వ ఏట అడుగుపెడుతున్నారు. దీంతో అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. అయితే ఆయన సతీమణి షాలినీ ఆయనకు ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. అజిత్‌కు బైక్స్ అంటే ఇష్టమని తెలిసి ఆయనకు ఓ స్పెషల్ స్పోర్ట్స్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసి ఫ్యాన్స్ 'ఈ సర్ప్రైజ్ ఎంతో స్వీట్‌గా ఉంది. కచ్చితంగా అజిత్‌కు కూడా నచ్చుంటుంది' అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో కపుల్ గోల్స్ అంటూ షాలినినీ కొనియాడుతున్నారు.
ఇక అజిత్ ఇటీవలె 'తునివు' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో ఈ సినిమాను 'తెగింపు' అనే పేరుతో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మంచి టాక్ అందుకుని కలెక్షన్స్‌లోనూ దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నారు. మగిల్ తిరుమనేని డైరెక్షన్‌లో 'విడా ముయార్చి' అనే మూవీలో అజిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఫారిన్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు. " ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అందులో అజిత్ కుమార్ డూప్ లేకుండా ఓ డేంజరస్ స్టంట్ చేశారు.