Aishwarya Rai Daughter Annual Day Performance : ముంబయిలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో గురువారం సాయంత్రం ఆ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలు షారుక్ ఖాన్ ఫ్యామిలీ, ఐశ్వర్య రాయ్ దంపతులు, సైఫ్ అలీఖాన్ దంపతలు హాజరై సందడి చేశారు. తమ పిల్లల పెర్ఫామెన్స్లు చూసి మురిసిపోయారు.
ఆ ఇద్దరే స్పెషల్ అట్రాక్షన్
అయితే ఈ వేడుకలో చాలా మంది సెలబ్రిటీల పిల్లలు పెర్ఫామ్ చేయగా, అందరి దృష్టి మాత్రం ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య, షారుక్ ఖాన్ తనయుడు అబ్రంపై పడింది. ఈ ఇద్దరు కలిసి క్రిస్మస్కు సంబంధించి ఓ స్టేజ్ షో చేశారు. ఆ సమయంలో కుమారుడిని చూసి షారుక్ పుత్రోత్సాహానికి లోనయ్యారు. అంతేకాకుండా అబ్రం పెర్ఫామెన్స్‌ను కెమెరాలో బంధించారు. మరోవైపు ఐశ్వర్య - అభిషేక్ కూడా తమ కుమార్తె పెర్ఫామెన్స్‌ను కెమెరాలో రికార్డు చేస్తూ మురిసిపోయారు. స్టేజీ కింద నుంచి ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
చాలా రోజులకు ఒకే ఈవెంట్‌లో :
మరోవైపు చాలా రోజుల తర్వాత అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ఒక ఈవెంట్‌లో కలిసి కనిపించారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ వేర్వేరుగానే పలు ఈవెంట్లకు హాజరవుతున్నారు. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ కుటుంబసభ్యులందరూ ఏదైనా కార్యక్రమానికి హాజరైనా కూడా కలిసి మాత్రం ఫొటోలు దిగట్లేదు. ఇక అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అంతా ఒకసారి ఫొటోలు దిగుతుండగా, తన కుమార్తె ఆరాధ్యతో ఐశ్వర్యరాయ్ విడిగా కెమెరా ముందుకు వస్తున్నారు.