AHSAAS CHANNA Career : సినీ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించి ఆ తర్వాత పెద్దయ్యాక వారిలో కొంతమంది స్టార్ స్టేటస్‌లను అందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా, హీరోహీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్, హిందీలో హృతిక్ రోషన్, అలియా భట్ వంటి స్టార్స్ ఒకప్పుడు ఇలా బాలనటీనటులుగా రాణించినవారే. అయితే తాజాగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్గా స్టార్ ఇమేజ్ సంపాదించుకుని కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది. ట్విస్ట్ ఏంటంటే ఈ ముద్దుగుమ్మ చిన్నప్పుడు అబ్బాయి పాత్రలలో ఎక్కువగా మెరిసింది.
తన పేరే అహ్సాస్ చన్నా. ఈమె తన ఐదేళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటగా వాస్తు శాస్త్ర (తెలుగులో మర్రిచెట్టు) అనే హారర్ చిత్రంలో నటించింది. ఇందులో సుష్మితా సేన్ కుమారుడు రోహన్ పాత్రలో కనిపించింది. 2004లో రిలీజైన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. అనంతరం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన కభీ అల్విదా నా కెహనా చిత్రంలోనూ షారుక్ - ప్రీతి జింటా కొడుకుగా(అర్జున్) మెరిసింది. ఇక 2007లోనూ మై ఫ్రెండ్ గణేశ్ చిత్రంలో గణేశ్‌తో స్నేహం చేసే అశు అనే అబ్బాయి పాత్రలో కనిపించింది.