Adah Sharma 15 Rupees Saree : అదా శర్మ ఈ పేరు చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. నితిన్ హార్ట్ అటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. కానీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. దీంతో తన ఫోకస్‌ను బాలీవుడ్‌కు షిప్ట్ చేసి అక్కడే కొనసాగుతోంది. లేడి ఓరియెంటెడ్ లేదా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే సినిమా, సిరీస్‌లు చేస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది. ఆ మధ్య కేరళ స్టోరీస్ సినిమాలో సెన్సేషనల్ అయింది.
అయితే హీరోయిన్లు అన్నాక డిఫరెంట్ మోడ్రన్ కాస్ట్యూమ్స్‌లో దర్శనమివ్వడం కామన్. ఒక్కోసారి ట్రెడిషనల్, మరోసారి మోడ్రన్ డ్రెస్సులో కనువిందు చేస్తుంటారు. అందరి కళ్లు తమవైపే ఉండేలా డ్రెస్టింగ్ స్టైల్‌తో కనిపిస్తుంటారు. టాప్ టు బాటమ్ హెయిర్ క్లిప్ నుంచి వాచ్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు ఇలా అన్నీ స్టైలిష్‌గానూ బాగా కాస్ట్లీగానూ ఉండేలా చూసుకుంటారు. అవి మనకు షాక్ కలిగించేలా ఉంటాయి.
అలానే అదా శర్మ కూడా ఎప్పుడూ అదే విధంగా కనిపిస్తుంటుంది. గ్లామర్ ఒలకబోస్తూ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఒక సింపుల్ చీరలో కనిపించి ఆకట్టుకుంది. దీంతో పాటే దాని ధర చెప్పి భారీ షాకింగ్‌కు గురి చేసింది. ఆమె లైట్ ఆరెంజ్ కలర్ చీరలో ట్రెండీ బ్లౌజ్ ధరించి ఎంతో క్యూట్‌గా మెరిసింది.