Actress Preeti Jhangiani Husband Hospitalised :బాలీవుడ్స్టార్ హీరోయిన్ప్రీతి జింగ్యానీ భర్త, బీటౌన్ నటుడు పర్విన్ దాబాస్‌కు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన బాంద్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలోనే చికిత్స అందుకుంటున్నట్లు ఆయన టీమ్ తెలిపింది.
పర్విన్ సతీమణి నటి ప్రీతి జింగ్యానీ తెలుగు వారికి సుపరిచితురాలే. ఈమె 'తమ్ముడు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించి ఇక్కడి వారికి చేరువయ్యారు. ఇందులో ఆమె జానకి అనే క్యారెక్టర్లో నేచురల్‌గా నటించి మెప్పించారు. ఈ సినిమా ద్వారానే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత తెలుగులోనూ పలువురు అగ్రతారల సరసన నటించారు. బాలకృష్ణతో 'నరసింహ నాయుడు', నాగార్జునతో 'అధిపతి' రాజేంద్ర ప్రసాద్‌తో 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' లాంటి సినిమాల్లో మెరిశారు. ఇక 'యమదొంగ' సినిమాలోని ఓ సాంగ్‌లో గెస్ట్ రోల్లో కనిపించారు. అయితే తెలుగులో చివరగా ఈమె 'విశాఖా ఎక్స్‌ప్రెస్' సినిమాలో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్లో బిజీ అయిపోయారు. తెలుగు, హిందీలోనే కాకుండా ఈమె కన్నడ, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ నటించారు. ఇటీవలే 'కఫాస్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇది కూడా ఓటీటీలో మంచి టాక్ అందుకుంది.