Actress Meena Second Marriage :టాలీవుడ్ హీరోయిన్ మీనా 90లో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఆమె సహజనటన ఎంతోమందిని ఆకట్టుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మీనా ఇండస్ట్రీకి కొద్ది కాలం దూరంగా కూడా ఉంది. అయితే ఆ మధ్య తన భర్తను కోల్పోయింది మీనా. ఆ బాధ నుంచి బయటపడేందుకు మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. వరుస షూటింగ్స్‌తో బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. అయితే గతకొన్నాళ్లుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి.
త్వరలోనే మీనా రెండో వివాహం చేసుకోబోతుందని వరుడు కూడా ఫిక్స్ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ తోపాటు కోలీవుడ్‌లోని కొందరి పేర్లు కూడా వినిపించాయి. ఈ పుకార్లన్నీ కూడా మీనాకు చాలా విసుగు తెప్పించాయి. భర్తను కోల్పోయిన బాధలో ఉంటే సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడంపై మీనా తీవ్రమనోవేదనకు గురైందట.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తాను రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయినట్లు వచ్చిన వార్తలపై స్పందించింది. ఇలాంటి రూమర్స్ వైరల్ చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు కోసం ఏమైనా రాస్తారా సోషల్ మీడియా, మీడియా నానాటికీ దిగజారిపోతుందని, వాస్తవాలు తెలుసుకుని రాయడం మంచిదంటూ చెప్పుకొచ్చింది. తాను ఒంటరిగానే ఉంటానని దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళలు ఎంతో మంది ఉన్నారని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు కోసం తాను ఆలోచిస్తున్నట్లు చెప్పకొచ్చింది.