Krithi Shetty On Negative Comments :సినీ ఇండస్ట్రీలో ఉండేవారిపై విమర్శలు చేయడం మామూలే. అయితే సోషల్ మీడియా వాడకం పెరిగాక అది ఇంకాస్త పెరిగింది. అలాంటి విమర్శలను అందరూ ఎదుర్కోవాల్సిందే అలాంటి విమర్శలు తనను చాలా బాధపెట్టాయి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది హీరోయిన్ కృతి శెట్టి.
"ప్రతి సినిమాకు మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు అయితే ఎంచుకునే పాత్రల విషయంలో కంఫర్ట్ ఫీల్ అవ్వగలను అంటేనే మీరు మీ బౌండరీ వెళతారు గాని ప్రస్తుతానికి మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోరు అంతే కదా?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పింది కృతి.
"నాతో పాటు నా కో యాక్టర్స్ కూడా చాలాసార్లు విమర్శలకు గురి అయ్యారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా నెగటివ్ గా తీసుకుని కామెంట్లు చేస్తూ ఉంటారు. అందరూ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొన్ని సక్సెస్ అయితే కొన్ని కాకపోవచ్చు ఇక్కడ ఎవరూ పర్ఫెక్ట్ కాదు కానీ ఇలా ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ నెగిటివిటీ చాలా ఉంటుంది. ఇంత వయసులో వాటి బారిన పడతాను అని నేను అనుకోలేదు అయితే కొన్ని మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి. నన్ను నేను నా పనిలో బెటర్ కావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కూడా చాలామందికి నెగిటివ్ కన్పిస్తుంది. మీడియా మమ్మల్ని చూపించే విధానం కూడా ఒక్కోసారి అందరూ ఈ నెగిటివిటీనే నమ్మేలా చేస్తుంది. అదే నన్ను ఎక్కువ బాధపెడుతూ ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చే ముందు అంటే ఈ పరిశ్రమ ఎలా పని చేస్తుంది అని తెలియక ముందు నాకు వీటి మీద కామెంట్ చేయడం చాలా ఈజీ కానీ ఇక్కడకు వచ్చాక ఇక్కడ ప్రాసెస్ ఎంత కష్టమో తెలిసిన తర్వాత కామెంట్ చేయలేం. అలాగే ఒక యాక్టర్ని విమర్శించడం తేలిక కానీ వాళ్లు కూడా మనుషులే అని గుర్తించాలి అదే నేను కోరుకుంటాను" అని చెప్పింది ఈ బ్యూటీ.