Actress Become IAS:సినిమాల్లో, టీవీ షోలలో నటీనటులు ఐఏఎస్ ఆఫీసర్ల పాత్రలు పోషించడం మనం తరచుగా చూస్తుంటాము. కానీ, నిజ జీవితంలో గ్లిట్జ్, గ్లామర్ ప్రపంచాన్ని వదిలి ఐఎఎస్ (Indian Administrative Service) అధికారిగా మారడటం చాలా అరుదు. అలా ఓ యువతి నిజంగా ఐఏఎస్ అయ్యింది. ఆమె ఎవరో కాదు హెచ్ఎస్ కీర్తన. ఆమె ఒకప్పుడు బాల నటి, కానీ ఆమె ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి సినిమా ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
యుపిఎస్‌సి (Union Public Service Commission) పరీక్ష భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. చాలా మంది రాణించాలని కలలు కంటుంటారు. దాని తగ్గట్లుగా రాత్రింబవళ్లూ కష్టపడి చదువుతుంటారు. ఇందులో రాణించక ఎన్నో విఫల ప్రయత్నాలతో విరమించుకునేవారు ఉంటారు. అయితే హెచ్ఎస్ కీర్తన మాత్రం ఐఏఎస్ సాధించాలన్న తపనతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. చలనచిత్రాలు, టీవీ షోలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారింది.
హెచ్ఎస్ కీర్తన ఒక పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. తెలుగుతోపాటు కన్నడ సినిమాలు, సీరియల్స్ లోనూ నటించింది. 'కర్పూరద గొంబే', 'గంగా-యమునా', 'ముద్దిన అలియా','ఉపేంద్ర','ఎ', 'కానూరు హెగ్గదాటి', 'సర్కిల్ ఇన్‌స్పెక్టర్', 'ఓ మల్లిగే', 'లేడీ కమీషనర్', 'హబ్బ', 'దొరే', 'సింహాద్రి', 'జనని','చిగురు', 'పుటాని ఏజెంట్','పుతని' వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి అందర్నీ మెప్పించింది. కానీ తనకు చదువుపై ఉన్న ఆసక్తితో ఐఏఎస్ కావాలని కలలు కన్నది.ఎలాగైన ఐఏఎస్ అయ్యి ప్రజలకు సేవా చేయాలని నిర్ణయించుకుంది.