తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

ETV Bharat / entertainment

వీరికీ తెర వెనకాల కష్టాలే! సినిమా షూటింగ్​లో స్టార్ హీరోలు ఇబ్బందిపడ్డ సందర్భాలివే! - Actors Tough Situations In Shooting

Actors Tough Situations In Shootings : చాలా మంది సినిమాల్లో నటించడం అంటే చాలా ఈజీ అనుకుంటారు. అయితే హీరోలు మాత్రం కొన్ని సార్లు తమ షూటింగ్స్​లో చాలా కష్టాలను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. తెర వెనుక వాళ్లు పడే కష్టం అంతాఇంతా కాదు. హీరోలు తాము ఇబ్బందిపడ్డ సందర్భాలను తెలియజేశారు. అవేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

Tollywood Actors Tough Situations In Shooting
Tollywood Actors Tough Situations In Shooting (ETV Bharat)

Actors Tough Situations In Shootings : తెరమీద హీరోల నటనను చూసినప్పుడు భలే అభిమానులు, ప్రేక్షకులకు భలే ఆనందంగా ఉంటుంది. కానీ తెర వెనుక వాళ్లు పడే కష్టం కూడా చాలా మందికి తెలియదు. అయితే సినిమాలు చేస్తున్నప్పుడు హీరోలు ఇబ్బందిపడిన కొన్ని సందర్భాలు వారి మాటల్లోనే.

బీడీ కాల్చి చాలా ఇబ్బందిపడ్డాను - మహేశ్ బాబు
ఒకప్పుడు నేను సిగరెట్‌ తాగేవాడిని. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ అలవాటును మానేశా. అలాంటిది మళ్లీ 'గుంటూరు కారం' మూవీ కోసం బీడీ కాల్చాల్సి వచ్చింది. సెట్లోకి వెళ్లి బీడీ తాగడం ఆలస్యం మైగ్రేన్‌ వచ్చేసి ఇబ్బంగిపడేవాడ్ని. ఒకటిరెండుసార్లు చూశాక, డైరెక్టర్ త్రివిక్రమ్​కు నేను ఇబ్బందిపడుతున్న విషయం గురించి చెప్పాను. దాంతో టీమ్‌ మొత్తం ప్రయత్నించి చివరకు నాకోసం ఆయుర్వేద బీడీని తయారుచేయించారు. అది పూర్తిగా లవంగం ఆకులతో తయారుచేసింది. అందులో ఎలాంటి పొగాకు లేకపోగా, పుదీనా ఫ్లేవర్‌లో ఉండటం వల్ల తలనొప్పి సమస్య లేకుండా గుంటూరు కారంలో సినిమా సెట్​లో బీడీని కాల్చాను.

ఫిజియోథెరపీ తప్పలేదు - అల్లు అర్జున్
ప్రేక్షకులకు పుష్ప-1 అనేది ఒక సినిమానే కానీ, నాకు మాత్రం ఒకేసారి నాలుగు సినిమాలు చేసినట్లుగా ఆ మూవీ షూటింగ్​లో అనిపించింది. ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగును చెబుతున్నప్పుడు మాత్రం కాస్త కష్టంగానే అనిపించేది. ఎందుకంటే ఈ సినిమా కన్నా ముందే నా ఎడమభుజానికి రెండు సర్జరీలు అయ్యాయి. దాంతో భుజాన్ని పైకెత్తి డైలాగు చెబుతున్నప్పుడు తీవ్రంగా నొప్పి అయ్యేది. షూటింగ్‌ అయిపోయాక ఫిజియోథెరపీ చేయించుకునేవాడిని. ఇక, మేకప్‌ వేయడానికి 2గంటలు పడితే, తీయడానికీ సమయం పెట్టుకోవాల్సి వచ్చేది. వీటన్నింటికీ తోడు పుష్పలో చిత్తూరు యాసలో మాట్లాడడం నాకు మరో సవాలులా అనిపించేది. అందుకే కొన్నాళ్లు చిత్తూరు యాసను నేర్చుకున్నాను. ఇంట్లోవాళ్లతోనూ ఆ యాసలోనే మాట్లాడేవాడిని.

రాత్రులు నిద్రపట్టేది కాదు-నాని
'దసరా' మూవీ షూటింగ్‌ ఎక్కువశాతం బొగ్గు గనుల్లోనే సాగింది. ఆ దుమ్మూధూళినీ, వేడినీ భరించడం కొన్నిసార్లు కష్టంగా ఉండేది. దుమ్ములో ఎక్కువసేపు ఉండటం వల్ల ఛాతీలో అసౌకర్యంగా అనిపించేది. దీంతో ఇంటికెళ్లినా సరిగ్గా నిద్రపట్టేది కాదు. షూటింగ్‌ పూర్తయ్యేవరకూ దాదాపు 2నెలలు కంటినిండా నిద్రలేని రాత్రులు గడిపాను. ఓ సన్నివేశంలో నేను బొగ్గు ట్రక్కు నుంచి దూకాలి. ఆ క్రమంలో బొగ్గు నా మీద పడిపోవడంతో దుమ్మంతా కళ్లల్లోకీ, గొంతులోకీ చేరిపోయి చాలా ఇబ్బందిపడ్డాను. మేకప్‌ తొలగించేందుకూ, షూటింగ్‌ సెట్‌లోంచి బయటకు రావడానికీ సమయం పట్టడం, డైరెక్టర్‌ కళ్లు ఎర్రగా కనిపించాలని చెప్పినప్పుడల్లా కొద్దిగా ఆల్కహాల్‌ తీసుకునేవాడిని. అయితే సినిమా సక్సెస్‌ కావడం వల్ల ఆ కష్టాలన్నింటినీ మర్చిపోయాను.

ఆ రోజు చాలా బాధపడ్డా-అడివి శేష్
'మేజర్‌' సినిమా నాకు మంచి గుర్తింపును ఇచ్చింది. అయితే ఆ క్లైమాక్స్​ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఓ స్టూడియోలో మంటల మధ్య షూట్ చేస్తున్నాం. అనుకోకుండా నాకు గాయమై రక్తం కారుతుండటం వల్ల పక్కకు వెళ్లి కూర్చున్నా. ఈలోగా ఓ బాలీవుడ్‌ చిత్రబృందం వచ్చి మా సెట్‌ మొత్తాన్ని తీసేయడం ప్రారంభించింది. వాళ్లు స్టూడియోను ఆ రోజుకు బుక్‌ చేసుకున్నారట. నేను మాట్లాడే స్థితిలో లేకపోవడంతో మా అసిస్టెంట్‌ డైరెక్టర్లు వెళ్లి క్లైమాక్స్‌ మాత్రమే ఉందనీ, కొన్ని షాట్లు తీసేస్తే అయిపోతుందనీ ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వాళ్లు వినిపించుకోలేదు. సుత్తులతో సెట్​ను పగలగొట్టేసినప్పుడు చాలా బాధపడ్డాను. చివరకు క్లైమాక్స్​ను ఎలాగోలా పూర్తిచేశాం.

ఏనుగు తొండం బరువు మోయలేకపోయేవాడ్ని - రానా దగ్గుబాటి
నేను చేసిన సినిమాల్లో 'బాహుబలి'కి ఎక్కువ కష్టపడ్డాను. ఆ తర్వాత ఎక్కువగా శ్రమించింది 'అరణ్య'కే. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించకముందే కొన్నిరోజులు ఏనుగుల మధ్య గడుపుతూ వాటిని మచ్చిక చేసుకున్నాను. ఇక, సినిమా షూటింగ్‌ అంతా కేరళలోని కారడవుల్లో జరిగింది. మా మొదటి లొకేషన్‌ సందన్‌పార అడవిలో జరిగింది. మేమంతా అక్కడకు వెళ్లేసరికి వరదల కారణంగా షూటింగ్‌ చేయలేకపోయాం. దాంతో మరో అడవిలోకి షూటింగ్​కు వెళ్లాల్సి వచ్చింది. ఇలా షూటింగ్‌ అంతా అడవుల్లో తిరగడం, కొండలెక్కి దిగడం, ఎక్కువదూరం నడవడం వంటి సాహసాలెన్నో చేశాము. అయితే అటవీ ప్రాంతం కావడం వల్ల చీకటిపడేలోగానే ప్యాకప్‌ చెప్పేసి మళ్లీ ఉదయం 5గంటలకల్లా రెడీ అయిపోయేవాళ్లం. ఇక, ఏనుగు తొండం బరువు సుమారుగా 130- 250 కేజీలు. ఆ తొండాన్ని నా భుజంపైన ఉంచినప్పుడు నొప్పితో అల్లాడినా సీన్​ను పూర్తి చేసేవాడిని.

అప్పట్లో హోటల్ సర్వర్, ఇప్పుడేమో టాప్ విలన్ - SJ సూర్య సక్సెస్ స్టోరీ ఇదే! - SJ Suryah Career

'స్లమ్​డాగ్​' సినిమాలో స్టార్ కిడ్? - ఆ తప్పు చేయకుండా ఉంటే! - Star Kid Who Lost Blockbuster Movie

ABOUT THE AUTHOR

...view details