Actor Who Gave Indias Two Biggest Flops: ఓ స్టార్ హీరో సినిమా విడుదల అవుతుందంటే ఇక ఫ్యాన్స్ దానిపై భారీ అంచనాలే పెట్టుకుంటారు. ఫస్ట్ గ్లింప్స్ దగ్గర నుంచి థియేట్రికల్ ట్రైలర్ వచ్చే వరకు ప్రతి అప్డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇక సినిమా రిలీజైందంటే ఇక ఆ రోజు థియేటర్లంతా సందడి సందడిగా ఉంటుంది. ఫ్యాన్స్ అంతలా సినిమాలను ఆదిస్తారు. అయితే కొన్ని సార్లు భారీ అంచనాలతో వచ్చే ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంటుంటాయి. చేసింది స్టార్ హీరోనే అయినా కూడా ఒక్కోసారి సినిమాలోని మిగతా అంశాలు కూడా దాని రిజల్ట్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంటుంది.
ఈ నేపథ్యంలో హీరోలు కూడా తమ తదుపరి సినిమాల విషయంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినప్పటికీ ఆ తర్వాతి సినిమాలు కూడా కొన్ని సార్లు ఆడియెన్స్‌ను నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి. వరుస హిట్లు అందుకున్న అదే హీరో వరుస డిజాస్టర్లతో డీలా పడిపోతుంటారు. అయితే ఆ నటుడికి ఉన్న స్టార్డమ్, అతడిపై ఉన్న నమ్మకం పలువురి మేకర్స్‌ను తమ సినిమాలకు సైన్ చేసేలా చేస్తాయి. ఇదే కోవకు చెందిన ఓ నటుడు ఇటీవలే తన సినిమాలతో దాదాపు రూ.400 కోట్లు నష్టాన్ని అందుకున్నారు. అయినప్పటికీ ఆయన్ను నమ్మి రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌ను చేస్తున్నారు నిర్మాతలు. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా సినిమా అంటే?
ఆ స్టార్ హీరో ఎవరో కాదు మన రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్. 'బాహుబలి' సినిమాలతో మాసివ్ సక్సెస్ అందుకున్న ఈ స్టార్ హీరో ఆ తర్వాత విడుదలైన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన 'సాహో', 'ఆదిపురుష్' సినిమాలు ఆడియెన్స్‌ను నిరాశపరిచాయి. 'సాహో' సినిమాకు రూ.170కోట్ల నష్టం వాటిల్లగా, ఆ తర్వాత వచ్చిన 'ఆదిపురుష్'కు రూ.230 కోట్ల మేర లాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాల మాట. అలా రెండు చిత్రాలు కలిపి దాదాపు రూ.400 కోట్లు మేర మేకర్స్ నష్టపోయారట.