వేణు ఇంట్లో విషాదం- తండ్రిని కోల్పోయిన నటుడు - undefined
Actor Venu Father Passed Away: టాలీవుడ్ సీనియర్ నటుడు తొట్టెంపూడి వేణు వెంకట సుబ్బారావు (92) సోమవారం కన్నుమూశారు. ఇవాళ (జనవరి 29) మధ్యాహ్నం 12.30 గం.కు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Actor Venu Father Passed Away
Published : Jan 29, 2024, 10:24 AM IST
Actor Venu Father Passed Away:టాలీవుడ్ సీనియర్ నటుడు తొట్టెంపూడి వేణు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు (92) అనారోగ్యంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. తొట్టెంపూడి వెంకట సుబ్బారావు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. వేణు కుటుంబానికి సానుభూతి వ్యక్త పరిచారు. ఇక ఈరోజు (జనవరి 29) మధ్యాహ్నం 12.30 గం.కు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.