Actor Rajendra Prasad Daughter Gayatri passed away :టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) కన్నుమూశారు. గుండె పోటు రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో రాజేంద్ర ప్రసాద్‌ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
Rajendra Prasad Comments on His Daughter : నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగిన రాజేంద్ర ప్రసాద్, మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కామెడీ హీరోగా మెప్పించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ పరసనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవరూ ఇండస్ట్రీలోకి రాలేదు.