35 Chinna Katha Kaadu OTT Release :మాలీవుడ్ స్టార్ హీరోయిన్ నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ '35 చిన్న కథ కాదు'. ట్రైలర్, టీజర్‌తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్‌గా నిలిచింది. అయితే ఇటీవల థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ ఆడియెన్స్‌ను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'ఆహా' వేదికగా అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. "ఈ చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది." అంటూ ఆహా షేర్ చేసిన పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.
స్టోరీ ఏంటంటే?
ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. ఆయన భార్య సరస్వతి (నివేదా థామస్). తన భర్త, పిల్లలు అరుణ్, వరుణ్ వీరే తన ప్రపంచంగా బతుకుతున్న సాధారణ గృహిణి ఆమె. తిరుపతిలో నివాసం ఉంటుంటారు. చిన్నోడు ఫర్వాలేదు కానీ, పెద్దోడికి (అరుణ్) మాత్రం లెక్కల పాఠాలు ఓ పట్టాన అర్థం కావు. సున్నాకి విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే కూడా పది ఎందుకవుతుందంటూ అడుగుతుంటాడు. తను అడిగే ఇటువంటి ప్రశ్నలకు టీచర్లు కూడా సమాధానాలు చెప్పలేకపోతుంటారు.