ETV Bharat / entertainment

యూఎస్‌ వెళ్లిన శివరాజ్‌కుమార్‌ - 'చికిత్స తర్వాత ఆ రెండు సినిమాలు తప్పకుండా చూస్తా' - ACTOR SHIVA RAJKUMAR HEALTH UPDATE

సర్జరీ కోసం యూఎస్ వెళ్లిన కన్నడ స్టార్ హీరో - నాలుగు వారాల పాటు అక్కడే రెస్ట్​!

Actor Shiva Rajkumar Health Update
Sivaraj Kumar (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2024, 12:38 PM IST

Actor Shiva Rajkumar Health Update : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న శాండల్​వుడ్ స్టార్​ హీరో శివ రాజ్‌కుమార్‌ తాజాగా చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడి ఒక ప్రముఖ ఆస్పత్రిలో ఆయనకు డిసెంబర్‌ 24న సర్జరీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఎయిర్‌పోర్ట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఈ విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

"నా కో స్టార్స్ అలాగే అభిమానుల నుంచి పొందుతోన్న ప్రేమాభిమానం, ఆశీస్సులకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నా ఆరోగ్యం విషయంలో సంయమనం పాటించిన మీడియాకు నా ధన్యవాదాలు. అంతా మంచిగానే జరుగుతుంది. సర్జరీ కోసం ఇంటిని వదిలి వెళ్తున్నప్పుడు ఎవరికైనా కాస్త ఆందోళనగానే ఉంటుంది. కానీ సాధారణంగా నేను చాలా ధైర్యంగా ఉంటాను. అయితే ఇప్పుడు మాత్రం ఇంటి నుంచి వస్తోన్న సమయంలో నా కుటుంబసభ్యులు, అలాగే అభిమానులను చూసినప్పుడు నేను కాస్త ఎమోషనల్‌గా అయ్యాను. సర్జరీ పూర్తయిన తర్వాత 'యూఐ', అలాగే 'మ్యాక్స్‌' సినిమాలు చూస్తాను" అని శివ రాజ్‌కుమార్‌ అన్నారు.

ఇక ట్రీట్‌మెంట్‌ తర్వాత శివ రాజ్​కుమార్ సుమారు నాలుగు వారాల పాటు అక్కడే ఉండనున్నారని సమాచారం. అయితే అమెరికా వెళ్లడానికి ముందు శివ రాజ్‌కుమార్‌ నివాసంలో ఓ పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు శివన్న ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. అంతేకాకుండా ఆయనకు ధైర్యం కూడా చెప్పారు.

అనారోగ్యం గురించి తొలిసారి అలా :
అయితే 'భైరతి రంగల్' ప్రమోషన్స్​ టైమ్​లో శివ రాజ్‌కుమార్‌ తొలిసారి తన అనారోగ్య సమస్య గురించి మాట్లాడారు. "నా ఆరోగ్య సమస్య గురించి తెలిసినప్పుడు ఫస్ట్​ టైమ్​ నేనెంతో భయపడ్డాను. అభిమానులు, ప్రజలు కలవరపడటం నాకు అస్సలు ఇష్టం లేదు. దాన్ని నేను ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పొందాను. ఇప్పుడంతా బాగానే ఉంది. నేను కూడా ఓ మనిషినే కదా. నాకు కూడా సమస్యలు వస్తుంటాయి. నాకు వచ్చిన అనారోగ్యానికి సంబంధించి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను" అని శివ రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం శివరాజ్ కుమార్ అప్​కమింగ్ మూవీస్ లైనప్​లో 'భైరవుడు', 'ఉత్తరకాండ', '45', 'RC 16' చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం రెస్ట్‌ తీసుకుని ఆయన తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని సినీ వర్గాల సమాచారం.

అవును బాధపడుతున్నా- సర్జరీ కోసం అమెరికా వెళ్తున్నా: శివరాజ్ కుమార్​

అందుకే రామ్‌ చరణ్‌ సినిమాలో నటించట్లేదు : విజయ్‌ సేతుపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.