Vijay Deverakonda Marriage : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్‌లో ఉన్నారంటూ కొంతకాలం నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన ఇప్పటికే స్పందించారు. తాజాగా ఈ రూమర్స్‌పై ఆయన మరోసారి రియక్ట్ మాట్లాడారు. తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు అందరికి చెబుతానని అన్నారు.
'నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో షేర్ చేసుకోవాలి అని నేను అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతా. అందుకు సమయం రావాలి. దానికంటూ ఒక ప్రత్యేక సందర్భం, కారణం ఉండాలి. అలాంటి సందర్భం వచ్చిన రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో షేర్ చేసుకుంటాను. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనబరుస్తారు. దానిని నేను వృత్తిలో భాగంగానే భావిస్తాను. దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను వార్తలుగా మాత్రమే చూస్తాను. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా' అని విజయ్ దేవరకొండ తెలిపారు.
అనంతరం ఆయన ప్రేమ గురించి కూడా మాట్లాడారు. 'అన్ లిమిటెడ్ లవ్ అనేది ఉందో, లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే గనక ఉంటే దానితోపాటు బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే బాధను కూడా భరించాల్సి ఉంటుంది' అని అన్నారు.
విజయ్ దేవరకొండ ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన వివాహం గురించి పలు వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టి పారేశారు. ప్రతి ఏడాది తనకు పెళ్లి అవుతుందనే వార్తలు కామన్ అయిపోయాయని అన్నారు. ఏడాదికి ఒకసారి తనకు పెళ్లి చేసేస్తున్నారని ఆయా వార్తలపై అసహనం వ్యక్తం చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన 'VD12' సినిమా చిత్రీకరణలో ఉన్నారు. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక 'ఫ్యామిలీ స్టార్'తో విజయ్ ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత పాన్ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'లో అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించారు.
లైఫ్ పార్ట్నర్ గురించి రష్మిక కామెంట్స్- అలా ఉండే వాడు కావాలట!
విజయ్ దేవరకొండ నటించిన ఆ సినిమా అంటే ఇష్టం : ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్