ETV Bharat / politics

కుటుంబ నియంత్రణ అమలుచేసిన రాష్ట్రాలను శిక్షించడం తగదు - తమిళనాడు సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్​ మద్దతు - KTR SUPPORTS TAMIL NADU CM COMMENTS

తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్ - నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయమన్న కేటీఆర్

KTR On Redivision
KTR On Redivision Constituencies (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 1:34 PM IST

KTR On Redistribution : నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం చేయవద్దని తమిళనాడు సీఎం స్టాలిన్​ చేసిన వ్యాఖ్యలను బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సమర్థించి, మద్దతిచ్చారు. కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలను శిక్షించడం తగదని కేటీఆర్​ పేర్కొన్నారు. దక్షిణాది పనితీరును పట్టించుకోకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను ఎవరూ విస్మరించలేరని తెలిపారు. దేశంలో తెలంగాణ జనాభా 2.8 శాతం ఉంటే జీడీపీ 5.2 శాతం అందిస్తోందని కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.