తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'12th ఫెయిల్' సెన్సేషన్​ - ఆ లిస్ట్​లో ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డు - 12th ఫెయిల్ సినిమా రికార్డు

12th Fail Movie Record : చిన్న సినిమాగా విడుదలై సూపర్​ హిట్​ను అందుకున్న సినిమా '12th ఫెయిల్'. ఈ సినిమా ప్రశంసలతో పాటు పలు రికార్డులను దక్కించుకుంటోంది. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది.

12th Fail Movie Record
12th Fail Movie Record

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 5:15 PM IST

Updated : Feb 9, 2024, 7:03 PM IST

12th Fail Movie Record : కొన్ని చిన్న సినిమాలుగా వచ్చి సూపర్​ హిట్​ను అందుకుంటాయి. అలా ఇటీవలే వచ్చిన చిత్రమే '12th ఫెయిల్'. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించారు. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 27న విడుదలై ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్​ అందుకుంది. అలానే డిసెంబర్ 29నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్​లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకొని మరి రికార్డులు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకుంది.

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDB) తాజాగా ప్రపంచ వ్యాప్తంగా టాప్ 250 ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో '12th ఫెయిల్' సినిమా 50వ స్థానంలో ఉంది. అయితే టాప్​ 50లో ఉన్న ఏకైక ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ విషయాన్ని డైరెక్టర్ విధు వినోద్ ఎక్స్ ద్వారా తెలిపారు.

'ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు చనిపోయినా ఫర్వాలేదనిపిస్తోంది' అంటూ విధు వినోద్ ఈ సినిమాపై స్పందించారు. అయితే గతంలోనే ఈ చిత్రం ఐఎమ్​డీబీలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా రికార్డును సొంతం చేసుకుంది. హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి మరి 9.2 రేటింగ్​తో సంచలనం సృష్టించింది.

సినిమా విషయానికొస్తే :ఐపీఎస్మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందింది. 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు పోటీపడనుంది. జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా చిత్రబృందం నామినేషన్‌ వేసింది. ఈ చిత్రంపై తాజాగా బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ ప్రశంసలు కురిపించారు. తనకెంతో నచ్చిందని పేర్కొన్నారు. విక్రాంత్‌ మస్సే అద్భుతంగా నటించారని, పాత్రకు జీవం పోశారన్నారు. ఈ చిత్రం ఎంతోమంది యువ నటుల్లో స్ఫూర్తి నింపిందంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

'యశస్వి క్రికెట్ వెర్షన్ ఆఫ్ మనోజ్ శర్మ'- జైశ్వాల్ జర్నీ '12th ఫెయిల్' సినిమాలాంటిదే!

టాలీవుడ్​ టూ కోలీవుడ్- తమిళ్​లోనూ మృణాల్ మార్క్​- మురుగదాస్ సినిమాలో ఛాన్స్​!

Last Updated : Feb 9, 2024, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details