12th Fail Movie Record : తక్కువ అంచనాలతో చిన్న సినిమాగా విడుదలైన '12th ఫెయిల్' మూవీ ఇప్పుడు ఎన్నో రికార్డులు అందుకుని దూసుకెళ్తోంది. తాజాగా మరో మైల్‌స్టోన్‌ను దాటింది. 23 సంవత్సరాలు తర్వాత దాదాపు 25 వారాలుగా థియేటర్లలో రన్ అయిన సినిమాగా ఘనతను అందుకుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ విధు వినోద్ చోప్రా ఆనందం వ్యక్తం చేశారు.
"ఈ హిట్ మూవీ థియేటర్లలో రిలీజై 25 వారాలు పూర్తయింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 23 ఏళ్ల తర్వాత ఈ మైల్‌స్టోన్‌ను దాటిన సాధించిన తొలి చిత్రంగా '12th ఫెయిల్' నిలిచింది. మా కలను నిజం చేసినందుకు ఆడియెన్స్‌కు స్పెషల్ థ్యాంక్స్. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది" అంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు ఇండియాలో సక్సెస్‌ఫుల్‌గా సందడి చేసిన ఈ మూవీ చైనాలోనూ విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ విషయం గురించి కూడా డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. "మంచి కథకు సరిహద్దులు దాటి ఆదరణ లభిస్తుందని నేను నమ్ముతాను. చైనాలోనూ ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే కొత్త ప్రేక్షకులకు చేరుకోవడం మాత్రమే కాదు, ఈ కథ మరికొందరిలోనూ స్ఫూర్తి నింపనుందని అర్థం. విడుదలైన ప్రతీ ప్రాంతంలోనూ దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. చైనీస్ ప్రేక్షకులు దీనితో ఎలా కనెక్ట్ అవుతారోనంటూ నాకు ఆసక్తిగా ఉంది. ఆ మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ డైరెక్టర్ రాసుకొచ్చారు.