100 Crore Tollywood Heros:టాలీవుడ్ అగ్రస్థాయి హీరోలు రూ.100 కోట్ల కలెక్షన్ సాధించడం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారిపోయింది. ఇప్పటికే అనేక మంది హీరోలు ఈ ఘనత కూడా సాధించారు. అయితే వాళ్ల తర్వాత మీడియం రేంజ్ హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. రీసెంట్గా సిద్ధు జొన్నలగడ్డ కూడా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. సిద్ధు లీడ్ రోల్లో నటించిన టిల్లు స్క్వేర్ సినిమా తాజాగా రూ.100 కోట్లు క్రాస్ చేసింది. దీంతో మరో యంగ్ హీరో ఈ లిస్ట్సలో చేరాడు. అయితే ఇప్పటివరకూ రూ.100+ వసూళ్ల మార్క్ అందుకున్న యంగ్ హీరోలు ఎవరో చూద్దాం.
- తేజ సజ్జ: యంగ్ హీరో తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన హను-మాన్ 2024 సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్హిట్ అయ్యింది. చిన్న సినిమాగా రూపొందిన సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో హను-మాన్ వరల్డ్‌వైడ్‌గా రూ.330+ కోట్లు వసూల్ చేసింది. ఈ క్రమంలో హీరో తేజ తన మూడో సినిమాతోనే ఈ ఘనత అందుకున్నాడు
- నిఖిల్ సిద్ధార్థ్: యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్- అనుపమ పరమేశ్వరణ్ కాంబోలో 2022లో వచ్చిన కార్తికేయ-2 భారీ విజయం దక్కించుకుంది. అప్పటివరకు నిఖిల్ 10కిపైగా సినిమాలు చేసినా ఈ రేంజ్ కలెక్షన్లు ఎప్పుడూ అందుకోలేదు. కార్తికేయకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా నార్త్ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ కూడా రూ.100 కోట్లకుపై వసూళ్లు చేసింది.
- వైష్ణవ్ తేజ్: మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమా 'ఉప్పెన'తోనే ఈ ఘనత సాధించాడు. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకుగాను 2022 జాతీయ అవార్డు కూడా లభించింది.
- విజయ్ దేవరకొండ:రౌడీబాయ్ విజయ్ దేవరకొండ తన ఆరో సినిమా 'గీతా గోవిందం'తో రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా హీరోయిన్గా నటించింది.
- నాని:నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాడు. నాని దసరాకు ముందు అనేక సినిమాలు చేసినప్పటికీ ఈ ఘనత అందుకోలేకపోయాడు. దీంతో 2023లో రిలీజైన ఈ సినిమా నాని కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
- రవితేజ:టాలీవుడ్లో సీనియర్ అండ్ స్టార్ హీరో అయిన రవితేజకు రూ.100 కోట్ల సినిమాకు చాలా సమయం పట్టింది. ఆయన 2022లో ధమాకా సినిమాతో ఈ ఘనత అందుకున్నాడు.