తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

Indian Railway Jobs 2024 In Telugu : ఇంటర్​, ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. రైల్వే రిక్రూట్​మెంట్ సెల్ (RRC) సదరన్ రైల్వేలో ఉన్న 2860 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

RRC SR Apprentice Recruitment 2024
Indian Railway Jobs 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 10:27 AM IST

Indian Railway Jobs 2024 : సదరన్ రైల్వేలో ఖాళీ ఉన్న 2860 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రేడ్స్​
ఫిట్టర్​, వెల్డర్​ (గ్యాస్​ అండ్​ ఎలక్ట్రిక్​), టర్నర్​, ప్లంబర్​, ఎలక్ట్రికల్​, కార్పెంటర్​, పెయింటర్​, డీజిల్ మెకానిక్​, మెకానికల్​, అడ్వాన్స్​డ్ వెల్డర్​, ఎలక్ట్రీషియన్, ఎంఎల్​టీ, సీఓపీఏ, పీఏఎస్​ఏఏ, మెషినిస్ట్​

విద్యార్హతలు
అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా, కనీసం 50 శాతం మార్కులతో పది, ఇంటర్​తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.

వయోపరిమితి

  • ఫ్రెషర్స్ వయస్సు 15 ఏళ్లు నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎక్స్​-ఐటీఐ & ఎంఎల్​టీ అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 24 ఏళ్లలోపు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్టీ, ఎస్టీలకు 5 ఏళ్ల పాటు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

  • అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 + సర్వీస్​ ఛార్జీలు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులను అకడమిక్​ మార్కుల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వీరి డాక్యుమెంట్స్​ను, మెడికల్ సర్టిఫికెట్​ను వెరిఫై చేస్తారు. తరువాత అర్హులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ట్రైనింగ్ పీరియడ్​
ఫిట్టర్​, వెల్డర్​ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్​), మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్​ ట్రేడ్​ల్లోని అభ్యర్థులకు 15 నెలల నుంచి 2 ఏళ్ల వరకు ట్రైనింగ్ ఇస్తారు. మిగతా ట్రేడుల్లోని అభ్యర్థులకు 1 ఏడాదిపాటు ట్రైనింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా సదరన్​ రైల్వే అధికారిక వెబ్​సైట్​లోని https://iroams.com/RRCSRApprentice24/recruitmentIndex లింక్​ను ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ ఫోన్, ఈ-మెయిల్ అడ్రస్​ లాంటి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • మీ యూనిట్, డివిజన్​, ట్రేడ్ విభాగాలను సెలక్ట్ చేసుకుని OK చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • మీ మొబైల్​కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 2024 జనవరి 29
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఫిబ్రవరి 28

నేషనల్​ డిఫెన్స్​ అకాడమీలో 198 గ్రూప్​-సీ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ఉపాధికి దిక్సూచి ఈ కోర్సులు- పూర్తి చేస్తే రూ.లక్షల్లో జీతాలు!

ABOUT THE AUTHOR

...view details